Health & Lifestyle

క్రెడిట్ కార్డ్‌ల జారీపై RBI కొత్త నియమాలు...ఈ విషయం లో జరిమానా!

S Vinay
S Vinay

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లను నియంత్రించే నిబంధనలను సవరించింది.

CREDIT CARD:క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లను జారీ చేసే బ్యాంకులకు ఏజెన్సీలకు సంబంధించిన కొత్త నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RESERVE BANK OF INDIA )ఆదేశాలను ప్రకటించింది.

ఈ ఆదేశాల మేరకు ఏదైనా బ్యాంకు కానీ క్రెడిట్ కార్డులను అందించే ఏజెన్సీ ఇష్టానుసారంగా వినియోగదారుడి (CUSTOMER) అనుమతి లేకుండా క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి వీలులేదు. కార్డుల జారీకి వినియోగదారుడి సమ్మతి స్పష్టంగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ జారీ చేయడానికి ముందు వ్రాతపూర్వక అనుమతి అవసరం. వ్రాతపూర్వక సమ్మతి సాధ్యం కానట్లయితే, డిజిటల్ మార్గాలను ఉపయోగించవచ్చు.

క్రెడిట్ కార్డులను జారీ చేసిన తర్వాత కంపెనీలు వ్యవహరించే తీరుపై పెద్ద ఎత్తున వినియోగదారుల నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి పిర్యాదులు అందాయి. ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకున్న భారతీయ రిజర్వు బ్యాంకు, వీటిని నియంత్రించడానికి తాజాగా నిబంధనలను సవరించింది.

బకాయిల రికవరీ సమయంలో బెదిరింపులు లేదా వేధింపులకు గురిచేయొద్దని కార్డ్ జారీ చేసే ఏజెన్సీలకు మరియు థర్డ్-పార్టీ ఏజెంట్‌లకు స్ఫష్టం చేసింది.

రూ. 500/- జరిమానా
ఒకవేళ వినియోగదారుడు క్రెడిట్ కార్డు ని మూసివేయమని అభ్యర్థిస్తే ఆ పక్రియను ఏడు రోజుల్లోపు పూర్తి చేయాలి లేని పక్షంలో ఆపై ఆలస్యానికి రోజుకి 500 రూపాయాల జరిమానాను వినియోగదారుడికి చెల్లించవలిసి ఉంటుంది.
RBI జారీ చేసిన కొత్త ఆదేశాలు జూలై 01, 2022 నుండి అమలులోకి వస్తాయి, అన్ని బ్యాంక్‌లకి మరియు NBFCలకు వర్తిస్తాయి.

మరిన్ని చదవండి.

నిద్ర లేమి వల్ల ఒత్తిడి... ఆత్మహత్య ఆలోచనలు!

Share your comments

Subscribe Magazine