Health & Lifestyle

నిద్ర లేమి వల్ల ఒత్తిడి... ఆత్మహత్య ఆలోచనలు!

S Vinay
S Vinay

మన శరీరానికి నిద్ర అనేది చాల ముఖ్యమైనది. రోజువారీ పనులు చేసి శారీరకంగా మన శరీరం అలిసిపోతే ఒత్తిడి తో మన మెదడు అలసిపోతుంది. కాబట్టి ఈ రెండిటికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాల ముఖ్యం.

మానవ శరీరానికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్ర లేమి వల్ల మధుమేహం,గుండెపోటు,అధిక రక్త పోటు వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్‌:
నిద్రలేమి డిప్రెషన్‌ కి దారి తీస్తుంది. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం మెదడు పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతంది.బాగా ఒత్తిడికి గురై డిప్రెషన్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆత్మహత్య ఆలోచనలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఒక అధ్యయనం లో తేలింది.

జ్ఞాపకశక్తి క్షీణించిపోతుంది:
చాలా తక్కువ సమయం నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల్లో జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. చిన్న చిన్న విషయాలను కూడా తరుచుగా మర్చిపోతుంటారు.

నిద్ర లేకపోవడం వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది:
సరైన నిద్ర లేకపోవడం వలన చర్మం తన కాంతిని కోల్పోతుంది.ఇది చర్మంలోని ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది.కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి.నిద్రలేమి అలానే కొనసాగితే ఇవి శాశ్వతంగా మారతాయి.

నిద్రలేమికి ఇలా నివారించండి.
పగటి నిద్రలను పరిమితం చేయడం.

నిద్రవేళకు ముందు కాఫీ, టీలు తీసుకోవడం మానేయడం.

ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోవడం.

రాత్రి సమయాల్లో నిద్ర రాకపోతే పుస్తక పఠనం అలవాటు చేసుకోండి.

పడుకునే ముందు మీ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోండి.

నిద్రను నిర్లక్ష్యం చేయకుండా తగిన సమయాన్ని ఇవ్వండి, సమస్యలు వచ్చాక ఆందోళన చెందకుండా ముందే వాటిని నివారించి అడ్డుకట్ట వేయడం ఉత్తమం.

మరిన్ని చదవండి.

వేకువజామున నీరు తాగటం వలన కలిగే ప్రయోజనాలు,ప్లాస్టిక్ బాటిల్లో నీరు త్రాగితే ఏమవుతుంది?

రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

Related Topics

lack of sleep insomnia

Share your comments

Subscribe Magazine