News

పందెం ఎడ్లబండి పై... బహుమతి బెంజ్ కార్!

S Vinay
S Vinay

ఎద్దులబండి పోటీల్లో గెలిచిన వారికి బెంజ్ కార్ బహుమతిగా ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ఎమ్మెల్యే నితీష్ రాణే ప్రకటించారు.

ఎద్దులబండి పోటీలు దక్షిణ భారత దేశం లో సర్వ సాధారణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ సమయాల్లో ఈ పోటీలు ఊపందుకుంటాయి. తెలంగాణలో దసరా పండుగ సమయంలో వీటి హవా మొదలైతే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ సమయంలో వీటి జోరు ఉంటుంది.తమిళనాడు,కేరళ మరియు కర్ణాటకలో కూడా ఎద్దుల పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు.

ఐతే ఇటీవలే మహారాష్ట్రలో ఎద్దుల బండ్ల పందేలపై నిషేధం ఎత్తివేయడం తో అక్కడ ఇప్పుడు చాలా చోట్ల ఎద్దుల బండ్ల పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎద్దుల బండి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అతిపెద్ద ఎద్దుల బండి పోటీ పింప్రి చించ్‌వాడ్‌లో జరుగుతోంది.

మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ లాండేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎద్దుల బండ్ల పందెంలో ఎమ్మెల్యే నితీష్ రాణే విజేతలకు బహుమతులు అందజేశారు.అయితే ఈ తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యే నితీష్ రాణే ఎద్దుల బండ్ల పందెం గురించి పెద్ద ప్రకటన చేశారు.

ఎమ్మెల్యే నితీష్‌ రాణే మాట్లాడుతూ ఎద్దుల బండ్ల పందెంలో పాల్గొని గెలిచిన వారికి మెర్సిడెస్‌ కారును బహుమతిగా అందజేస్తానని తెలిపారు. ఈ ప్రకటన ఇప్పుడు ఎద్దుల బండి పోటీ దారులనే కాకుండా సామాన్య ప్రజలను కూడా ఆకర్షిస్తుంది.అయితే నితీష్ రాణే ఈ ప్రకటన చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ విషయం చర్చనీయాంశం అయింది. ఏది ఏమైనప్పటికి ఇప్పుడు ఆ బెంజ్ కారుని ఎవరు గెలుచుకుంటారో అని మహారాష్ట్ర వాసులలో ఆసక్తికర చర్చ మొదలైంది.

మరిన్ని చదవండి.

రూ.35 కోసం రైల్వేతో 5 సంవత్సరాల పాటు పోరాటం...చివరికి 3 లక్షల మందికి లబ్ది!

స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఫిక్షనల్, డాగ్ మ్యానే ఒరిజినల్!

Share your comments

Subscribe Magazine