భారత దేశంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ కంపెనీ భరత్ బయోటెక్, కోవిడ్ సమయంలో అతికొద్ది సమయంలోనే కోవిడ్ వాక్సిన్ కనిపెట్టి కొన్ని వేల ప్రాణాలు కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించింది. ఇప్పుడు భరత్ బయోటెక్ మరొక్క చారిత్రాత్మక ఘట్టానికి సంసిద్ధమయ్యింది. స్పెయిన్ కు చెందిన బయోఫ్యాబ్రి అనే ఫార్మసీటుకేల్ సంస్థ తయారు చేసిన టీబీ వాక్సిన్ హ్యూమన్ ట్రైల్స్ భరత్ బయోటెక్ నిర్వహించబోతుంది.
టీబీ అనేది ఊపిరితిత్తుల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సరైన వైద్యం అందక ప్రతీ ఏటా కొన్ని లక్షల మంది జనం తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పడు మనకు అందుబాటులో ఉన్న బాసిల్లస్ కాల్మెట్టే వేరియెంట్ వాక్సిన్ టీబీ ని నియంత్రించడానికి వాడుతున్నారు, కానీ ఈ వేరియెంట్ టీబీ మీద అంత ప్రభావం చూపించకపోవడంతో స్పెయిన్ కు చెందిన బయోఫ్యాబ్రి MTBVAC అనే వాక్సిన్ ని అభివృద్ధి చేసింది. ఈ వాక్సిన్ ప్రపంచంలోనే మొదటి సారి టీబీకి లైవ్ అటెన్యూయేటెడ్ టీకా లాగా నిలుస్తుంది. అయితే ఈ వాక్సిన్ యొక్క సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు భరత్ బయోటెక్ మనుషుల మీద క్లినికల్ ట్రైల్స్ నిర్వహించబోతుంది. ఈ ట్రైల్స్ 2025 నుండి మొదలవుతున్నటు భరత్ బయోటెక్ ప్రకటించింది.
బయోఫ్యాబ్రి సంస్థ సీఈఓ ఎస్టబెన్ రోడ్రిగీజ్, తమ సంస్థ తయారుచేసిన ఈ వాక్సిన్ ప్రపంచం మొత్తం మీద 28% టీబీ రోగులు కలిగి ఉన్న భారత దేశంలో పరీక్షించడం ఒక గొప్ప మార్పుకు శ్రీకారంచుడుతుందని తెలిపారు. అలాగే భరత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, భరత్ బయోటెక్ టీబీ కి ఒక సమర్ధవంతమైన వాక్సిన్ కనిపెట్టడం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ వాక్సిన్ ప్రయోగం విజయవంతమైతే కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు వీలుంటుంది.
Share your comments