Health & Lifestyle

హెచ్ఐవికి ఇంక చికిత్స దొరికినట్లే....

KJ Staff
KJ Staff

చాల సంవత్సరాలనుండి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న హెచ్ఐవి కి మందు దొరికినట్లే. ఇప్పటివరకు కొన్ని లక్షల మంది హెచ్ఐవి భారిన పడి తమ ప్రాణాలు కోల్పోయారు. హెచ్ఐవి కి మందులు ఉన్న పూర్తి చికిత్స మాత్రం లేదు, కనుక హెచ్ఐవి సోకినా వ్యక్తి వ్యవధి సోకిన 10 సంవత్సరాలోపు తమ ప్రాణాలు కోల్పోతారు. అయితే డచ్ శాస్త్రవేత్తల బృందం ఈ వ్యాధిని నివారించే చికిత్స కనుగొన్నారు.


హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్మ్యూనో వైరస్ గా పిలవబడే ఈ వైరస్ మనిషి, రోగనిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోగాలనుండి రక్షించే టీ-సెల్స్ మొత్తం ఆక్రమించి హెచ్ఐవి తన వశంలోకి తెచ్చుకుంటుంది, తద్వారా రోగనిరోధక శక్తీ తగ్గి, రోగాల భారిన పడి మనిషి మరణిస్తాడు

ఇంతటి ప్రమాదకరమైన ఈ వైరస్ ని మందుల ద్వారా కొద్దీ శాతం నియంత్రించవచ్చు, కానీ ఇప్పటివరకు ఈ వైరస్ కి పూర్తి చికిత్స అందుబాటులో లేదు. కొంతమంది డచ్ శాస్త్రవేత్తల బృందం హెచ్ఐవి చిటికిత్సకు సంభందించిన, పరిశోధన గురించి యురోపియన్ కాంగ్రెస్ అఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ వెల్లండించే అవకాశం ఉంది.

నోబెల్ బహుమతి పొందిన CRISPR జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ సహాయంతో హెచ్ఐవి ని విజయవంతంగా తొలగించినట్లు తెలిపారు. CRISPR టెక్నాలజీ మొలిక్యూలర్ కటింగ్ అని పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరుగా టి-సెల్స్ లోని వైరస్ డిఎన్ఏ తొలగిస్తుంది. ఈ CRISPR టెక్నాలజీ శరీరం మొత్తం ఉన్న హెచ్ఐవి వైరస్ని నిర్ములించడంలో సహాయపడుతుంది. అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి చాల పరిశోధన ఇంకా అవసరం ఉంది కనుక ఈ చికిత్స అందుబాటులోకి రావడానికి చాలాకాలం పడుతుంది. ఈ టెక్నాలజీ కనుక వాడుకలోకి వచ్చినట్లైతే హెచ్ఐవి తో భాదపడుతున్న కొన్ని వందలాది కుటుంబాలను రక్షించించవచ్చు.

చర్మ వ్యాధులతో భాద పడుతున్నారా... వీటిని పాటించి చర్మ సమస్యలు దూరం చేసుకోండి.

కోవిడ్ భారిన పడినవారు కొంచెం జాగ్రత్త.

Share your comments

Subscribe Magazine