బ్యాంకు అఫ్ ఇండియా వ్యవసాయదారు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సులువైన రుణాల కొరకు కొత్త స్కీంలు ప్రవేశపెట్టింది. స్కీం వివరాలు తెల్సుకుందాం రండి.
భారతీయ వ్యసాయాన్ని యాంత్రికారించడం వైపు నడిపించే విధానంలో భాగంగా బ్యాంకు అఫ్ ఇండియా కృషి వాహన్ , ఫార్మ్ మెకనైజషన్ స్కీం లను ప్రవేశపెట్టింది. ఈ స్కీం 2024 మార్చ్ 2024 వరకు కొనసాగనుంది. రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ఈ స్కీమ్స్ రూపంలో అందించనుంది. వ్యసాయానికి అవసరం అయ్యే యంత్రాలు, పనిముట్లు, వాహనాలు కొనుగోలు చేసందుకు ఈ స్కీం ఎంతగానో ఉంపయోగపడతాయి
Krishi Jagran MOFI VVIF Kisan Bharat Yatra : ఆర్ ఎల్ బి సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి ప్రారంభం కాబోతున్న, కృషి జాగరణ్ MFOI, వివిఐఎఫ్ కిసాన్ భారత్ యాత్ర
కృషి వాహన్ స్కీం ద్వారా వ్యవసాయ వాహనాల కొనుగోలులో 90% ఎక్స్ షోరూం ధరను ఈ స్కీం కవర్ చేస్తుంది. రైతులకు 25,0000 వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరమా లేదా అదే విధంగా వ్యాపారస్తులకు 1 కోటి రూపాయిలు వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ మెషినరీ కొనుగోలు లో 85% వరకు ఈ లోన్ భర్తీ చేస్తుంది.
సాధికారతకు నిబద్ధత:
రైతులకు మరియు వ్యవసాయ వ్యాపారస్తులకు సాధికారత కల్పించి బ్యాంకు అఫ్ ఇండియా కర్షకులకు ప్రోత్సహాన్నిస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆలచనలకు అనుగుణంగా ఈ స్కీమ్స్ రూపొందించబడ్డాయి. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంట ఉత్పాదకతను పెంచడం ద్వారా రాబోయే రోజుల్లో భారతీయ వ్యసాయాన్ని సుసంపన్నం చెయ్యడం ఈ స్కీం ముఖ్య ఉద్దెశం.
కృషి వాహన్ కీలక లక్షణాలు:
ఆకర్షణీయమైన వడ్డీ రేటు.
25,0000 వరకు ఎటువంటి కొల్లట్రాల్ అవసరం లేదు.
సులువైన డాక్యుమెంటేషన్ పద్దతి.
తక్షణ రుణ సౌకర్యం.... ఇంకా మరి ఎన్నో
ఫార్మ్ మెకనైజషన్ కీలక లక్షణాలు:
లోన్ తిరిగి చెల్లించడానికి ఎక్కువ కాలం వ్యవధి.
ఆకర్షణీయమైన వడ్డీ రేటు.
1.60 లక్షల ఋణం వరకు ఎటువంటి కాలట్రల్ అవసరం లేదు.
యంత్రాల ధరలో 85% వరకు చెల్లించే అవకాశం.
Share your comments