2022-23 కేంద్ర బడ్జెట్ దృష్టి వ్యవసాయ రంగం లో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని ,వ్యవసాయ రంగం లో కొత్త వొరవడులు సృష్టిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం జరిగిన వ్యవసాయ వెబినార్ లో వెల్లడించారు . వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడే మార్గాలపై చర్చిస్తూ, గత ఏడేళ్లలో, విత్తనం నుండి మార్కెట్ వరకు మొత్తం వ్యవసాయ విలువ గొలుసు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, పాత వ్యవస్థలను కూడా మెరుగుపరిచిందని మోదీ అన్నారు.
ఆధునిక వ్యవసాయంపై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగిస్తూ, వ్యవసాయ బడ్జెట్ కేవలం ఆరేళ్లలో అనేక రెట్లు పెరిగిందని, రైతులకు వ్యవసాయ రుణాలను కూడా ఏడేళ్లలో 2.5 రెట్లు పెంచామని ఆయన అన్నారు.
ఇటీవలి బడ్జెట్ లో వ్యవసాయాన్ని ఆధునికంగా, మార్చడానికి ఏడు ప్రధాన మార్గాలను సూచించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. వీటిలో గంగా నదికి ఇరువైపులా 5 కిలోమీటర్ల వెడల్పు కారిడార్లతో మిషన్ మోడ్ లో సహజ వ్యవసాయం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచడం, 1.5 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో రెగ్యులర్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలను కల్పించడం ఉన్నాయి.
దేశంలో మట్టి పరీక్షా ప్రయోగశాల లను స్థాపించడానికి కొత్త స్టార్టప్ లు ముందుకు రావాలని మోడీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం భారతీయ ప్రజలకు .ఆద్యం సమకూర్చడం వెన్నుముక లాంటిదని అయన తెలిపారు.
ఇంకా చదవండి .
Share your comments