News

PM MODI : మధ్యప్రదేశ్ ఇండోర్ మునిసిపాలిటీ లో "CNG " ప్లాంటును ప్రారంభించిన ప్రధాని మోడీ !

Srikanth B
Srikanth B

ఇండోర్ లో ఆసియాలోననే అతిపెద్ద బయో CNG ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ,మధ్యప్రదేశ్ ఇండోర్ మునిసిపాలిటీ లో ఘన వ్యర్థాల ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్ ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 19, 2022) వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

ఇండోర్ లో మునిసిపల్ ఘన వ్యర్థాల ఆధారిత గోబర్-ధన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, "రాబోయే2 సంవత్సరాలలో దేశంలోని 72 పెద్ద  గోబర్-ధన్ ప్లాంట్, బయో-సిఎన్ జి ప్లాంట్లను నిర్మించడానికి పనులు జరుగుతున్నాయని

"ఈ కార్య క్ర మం దేశంలోని న గ రాల ను పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా మార్చడానికి, వాటిని పరిశుభ్ర మైన సమాజం  వైపు తీసుకెళ్ల డానికి తోడ్ప డుతుంది" అని ప్ర ధాన మంత్రి  మోదీ అన్నారు.

 

కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు. పారిశుధ్య కార్మికులకు  ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. "చాల దుర్భరమైన పరిస్థితులు , కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పారిశుధ్య కార్మికులకులు  చాల కష్ట పడి పనిచేసాయరని దానికి  కృతజ్ఞతలు తెలియజేసారు . . స్వచ్ఛ భారత్ మిషన్ పట్ల మీ నిబద్ధత మరియు అంకితభావానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము" అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకతలు :

  •  రూ.150 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు.
  • ఉత్పత్తి చేయబడ్డ బయోగ్యాస్ లో 50 శాతం ప్రజా రవాణా పోర్ట్ వాహనాలను నడపడానికి అందించబడుతుంది, మిగిలినవి విభిన్న పరిశ్రమలకు లభ్యం అవుతాయి.
  • ఇండోర్ లో దాదాపు 400 బస్సులు త్వరలో ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే బయోగ్యాస్ పై నడుస్తాయి.
  • ప్లాంట్ ఏర్పాటు చేసిన 15 ఎకరాల భూమి డంపింగ్ జోన్ గా ఉండేది.
  • ఇది రోజుకు 550 మెట్రిక్ టన్నులప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
  •  ఈ ప్లాంట్ ప్రతిరోజూ 17,500 కిలోల బయోగ్యాస్ మరియు 100 టన్నుల అధిక నాణ్యత కలిగిన కంపోస్ట్ ను ఉత్పత్తి చేయగలదు.

100 శాతం తడి వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాంట్ 90 శాతం స్వచ్ఛమైన మీథేన్ వాయువుతో సిఎన్ జిని ఉత్పత్తి చేస్తుంది.

ప్లాంట్ ను తయారు చేసిన సంస్థ  కు ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ కు 20 సంవత్సరాలపాటు సంవత్సరానికి రూ.2.5 కోట్లు చెల్లిస్తుంది.

- ఈ సాంకేతిక పరిజ్ఞానం  తో ఏటా 1,30,000 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించడం ద్వారా అధిక  జనసాంద్రత కలిగిన నగరాల గాలి నాణ్యతను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది

Share your comments

Subscribe Magazine