News

"ఎరువుల సరఫరాలో జాప్యం .. వానాకాలం పంట పై ప్రభావం" - మంత్రి నిరంజన్ రెడ్డి

Srikanth B
Srikanth B

రాష్ట్రంలోని రైతులకు ఎరువులు సరఫరా చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు సకాలం లో సరఫరా చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సోమవారం వెల్లడించారు .

ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభాన్ని సాకుగా చూపి కేంద్రం సకాలంలో ఎరువులు సరఫరా చేయడం లేదని . హైదరాబాద్ లో  జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల సరఫరాలో జాప్యం రైతులకు మంచిది కాదని అన్నారు.

రాష్ట్రానికి 10.5 లక్షల టన్నుల యూరియా, 9.4 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 2.3 లక్షల టన్నుల డీఏపీ సహా 24.45 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించిందని, ఇకనైనా ఆలస్యం చేయకుండా కేంద్రం  త్వరగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

మే నెలాఖరు నాటికి కనీసం ఐదు లక్షల టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని సమావేశంలో అధికారులను ఆదేశించారు. విచక్షణారహితంగా ఎరువులు వాడవద్దని , భూసార పరీక్షలు చేయించి తదనుగుణం గ ఎరువులను వదలని సూచించారు.

ఇది కూడా చదవండి .

Benefits of Mango: వేసవిలో మామిడి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Share your comments

Subscribe Magazine