చట్టం ప్రకారం గంజాయిని పెంచడం మరియు రవాణా చేయడం చట్టవిరుద్ధం. అయితే ప్రభుత్వం పంట సాగుకు అనుమతిస్తే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోచ్చు.
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వం గంజాయి సాగుకు అనుమతి కల్పిస్తుంది. మన దేశంలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గంజాయి పంట సాగుకు అనుమతి ఉంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్రాల మాదిరిగా గంజాయి సాగుకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఉంది.
భారత్ లోని కొన్ని రాష్ట్రాలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగుకు అనుమతి ఉంది. నేరాలు ఎక్కువగా జరిగే ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో గంజాయి పంట సాగుకు అనుమతి ఉంది. ఈక్రమంలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఆ రాష్ట్రాల బాటలోనే నడవాలని యోచిస్తున్నట్లుగా ఉంది.గంజాయి అక్రమ రవాణాను ఎలాగో ప్రభుత్వం ఆపలేకపోతుంది, కాబట్టి దాని సరఫరాను తగ్గించడానికి దాని సాగును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ ఎంపికను అన్వేషిస్తోంది.
ఇది కూడా చదవండి..
రైతులకు శుభవార్త: రైతులకు అందుబాటులోకి 'నానో డీఏపీ'..కేవలం రూ.600లకే
గంజాయి సాగును చట్టబద్ధం చేసే అంశాన్ని పరిశీలించాలని, నిపుణుల కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ అన్నారు. కమిటీ నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే దీని సాగును కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది అని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. కేనాబిస్ ఆకులు, విత్తనాల వినియోగానికి సంబంధించిన సమాచారం ఆధారంగా మన చట్టం ఉంటుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో, రాష్ట్ర చట్టాల ప్రకారం గంజాయి సాగు చట్టవిరుద్ధం. అయితే నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో అక్రమ సాగు మరియు తరలింపు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయిని చట్టబద్ధం చేస్తే విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం పెరగవచ్చని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి..
Share your comments