News

కనీస మద్దతు ధర కోసం రోడెక్కిన రైతులు..

Srikanth B
Srikanth B
కనీస మద్దతు ధర కోసం రోడెక్కిన రైతులు.. (Photo Courtesy: @Gagan4344/Twitter)
కనీస మద్దతు ధర కోసం రోడెక్కిన రైతులు.. (Photo Courtesy: @Gagan4344/Twitter)

సన్‌ఫ్లవర్‌ గింజలకు కనీస మద్దతు ధర కల్పించాలని హర్యానా , చండీఘడ్ కు చెందిన రైతు సంఘాలు రైతులతో కలిసి భారీ ఆందోళను చేపట్టాయి. కురుక్షేత్ర -చండీఘడ్‌ హైవేను రైతులు దిగ్బంధించి తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు . హైవేపై రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను పెట్టి ఆందోళన చేపట్టారు రైతులు. ఫ్లైఓవర్లను కూడా రైతులు దిగ్బంధించారు. "మద్దతు ధర కల్పించండి.. రైతులను రక్షించండి". అనే నినాదం తో రైతులు భారీ ఎత్తున నిరసనలను చేపట్టారు .

పొద్దుతిరుగుడు పంటకు ఎంఎస్‌పి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నామ్ సింగ్ చురానీ దాదాపు ఆరు గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్‌ క్యానన్లను ఉపయోగించి నిరసనకారులను చెదరకొట్టారు . అంతేకాకుండా, చట్టవిరుద్ధంగా సమావేశం మరియు అల్లర్లు వంటి ఆరోపణలపై దాని అధ్యక్షుడితో సహా తొమ్మిది మంది భారతీయ కిసాన్ యూనియన్ నాయకులను అరెస్టు చేశారు.

పీఎం కిసాన్ 14 వ విడత రావాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ..!

రైతుల ఆందోళనపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తికాయత్‌ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు నిరసనలను మరింత తీవ్ర తరం చేస్తామని , రైతులకు కనీస మద్దతు కల్పించే విధంగ చట్టం చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.

అయితే ఇటీవలే ప్రభుత్వం 2023 -24 సంవత్సరానికి కనీస మద్దతు ధరను ప్రకటించింది. పెరిగిన ధరలు రైతులకు ఏవిధంగా కూడా మేలు చేసే విధంగా లేవని రైతులు విమర్శలు చేస్తున్నారు .

పీఎం కిసాన్ 14 వ విడత రావాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాల్సిందే ..!

Related Topics

farmerprotest

Share your comments

Subscribe Magazine

More on News

More