News

పార్లమెంట్ వద్ద రైతులు పంట అమ్ముతారు

KJ Staff
KJ Staff

ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ పంటలను పార్లమెంట్ ప్రాంగణంలో అమ్ముతారని వ్యాఖ్యానించారు.  తాజాగా జైపూర్‌లోని విద్యానగర్ స్టేడియంలో నిర్వహించిన కిసాన్ మహాపంచాయత్ బహిరంగ సభలో ఆయ పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ.. రైతులు తమ పంట ఉత్పత్తులను పార్లమెంట్ భవనం వద్ద అమ్మేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. రైతులు తమ పంటల్ని అమ్మేందుకు పార్లమెంట్‌కి వెళతారని, అవసరమైన సమయంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు.

రైతులు ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చని ప్రధాని చెప్పారని, అందుకని రైతులు పార్లమెంట్ ముందే పంటను అమ్ముతారని టికాయత్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీలు, కలెక్టర్ కార్యాలయాలు వద్ద కూడా రైతులు తమ పంటను అమ్ముతారని టికాయత్ పేర్కొన్నారు

అటు రైతులు చేస్తున్న ఉద్యమానికి యువత మద్దతిస్తుందని, ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని టికాయత్ తెలిపారు. రైతులంతా ఐక్యంగా పోరాడుతున్నామని, విడిపోయే ప్రసక్తే లేదని టికాయత్ పేర్కొన్నారు.

Share your comments

Subscribe Magazine