భారత దేశం వ్యవసాయ ఆధారిత దేశం. హరిత విప్లవం తరువాత దేశ ఆహార అవసరాలకు సరిపోయేటంత ఆహారం ఉత్పత్తి చేస్తున్నాం కానీ, పౌష్టికాహార లోపంతో ఇంక వెనకబడే ఉన్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAO) నివేదిక ప్రకారం దేశ జనాభాలో 14% మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ మేరకు పౌష్టికాహార లోపాన్ని తగ్గించి ఆహార భద్రత పెంచడానికి, బయోఫోర్టిఫైడ్ రకాలు పెంచేందుకు ఐసిఏఆర్ రెండు కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ద్వారా ఆహారంలో పోషకాలు లోపాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి, ఆరోగ్యకరమైన ఆహారమే ప్రధానం. మన దేశంలో ప్రభుత్వం, ప్రజలకు ఆహరం అందించగలుగుతుంది కానీ, పౌష్టికాహార లోపాన్ని మాత్రం భర్తీ చెయ్యలేకున్నది. ముఖ్యంగా ఎంతో మంది చిన్నపిల్లలు పోషక లోపాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు అందించడానికి ధాన్యం, పప్పులతో పాటు, పళ్ళు, కూరగాయలు, పాలు నిర్దిష్ట పరిమాణంలో తీసుకోవాలి, లేకుంటే పోషకాలు లోపం తలెత్తుతుంది. ఇంత ఎక్కువ జనాభా కలిగిన దేశంలో అందరికి సరిపోయేంత పౌష్టికాహారం అందించడం ప్రభుత్వానికి సాధ్యపడదు.
అయితే బయోఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఈ లోపాన్ని భర్తీ చెయ్యగలవు. బయోఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే, ఆహారంలో సహజంగా ఉండే పోషకాలతో పాటు వాటికి అదనపు పోషకాలను జతచేస్తే వాటిని బయోఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటారు. మన దేశంలో విరివిగా పండించే ధాన్యం, పప్పుదినుసుల్లో, శరీరానికి అవసరమయ్యే అదనపు పోషకాలను జతచెయ్యగలిగితే, మన దేశంలో ప్రబలంగా ఉన్న పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చు. ఇప్పటివరకు భారత దేశంతో పాటు, ఎన్నో దేశాల్లోని పరిశోధన సంస్థలు బయోఫోర్టిఫైడ్ రకం మొక్కలను అభివృద్ధి చేసింది. వీటి పట్ల రైతుల్లో అవగాహనా కల్పిస్తే వీటికి ప్రాచుర్యం పెరుగుతుంది.
దినికి సంబంధించి ICAR ఎన్నో కార్యక్రమాలను మొదలుపెట్టింది. అంతేకాకుండా ఈ సమస్త అభివృద్ధి చేసిన, ధాన్యం, మొక్కజొన్న, కందులు, మినుములు, వేరుశెనగ, సోయాబీన్, వంటి పోషకాలు అధికంగా ఉండే, అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో పాటు ఉద్యాన పంటలైన, బంగాలదుంప, చిలగడదుంప, దానిమ్మ, కాలీఫ్లవర్, వంటి రకాలను కూడా అభివృద్ధి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిలో ఐరన్, జింక్, పొటాషియం ధాతువులు, వివిధ విటమిన్స్, ఎమినో ఆసిడ్స్, జతచేర్చబడినవి. వీటివలన శరీరానికి పోషకాలు అన్ని లభ్యమౌతాయి.
Share your comments