News

గుడ్ న్యూస్: అమ్మఒడి పెండింగ్ పేమెంట్స్ ఖాతాల్లో జమ అయ్యేది ఆ తేదీనే !

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేసింది, విద్య ఖర్చులు తల్లిదండ్రులకు అధిక భారం కాకూడదనే ఉద్దేశ్యంతో పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమని, ఫలితంగా విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఈ మార్పులలో ఒకటి ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం. ఇంకా, ప్రస్తుత డిమాండ్‌లకు అనుగుణంగా పాఠశాలలు ఆధునీకరించింది ప్రభుత్వం. ఈ ప్రయత్నంలో భాగంగానే అమ్మ ఒడి పథకం అమలులోకి తీసుకువచ్చింది, ఈ పథకం ద్వారా పిల్లలు పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లే తల్లులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ప్రత్యేకంగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం 15 వేల రూపాయలను జమ చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నాలుగో విడత నిధులను తల్లీబిడ్డల ఖాతాల్లో జమ చేసింది. అయితే కొంతమందికి ఖాతాలో నగదు జమ కాగా మరికొందరికి పడలేదు. డబ్బులు పడని వారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ కి పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచనా.. ఈ జిల్లాలకు అలెర్ట్..

జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ. 15వేల రూపాయలను ప్రభుత్వం జమచేస్తున్నది. కాగా నాలుగో విడతలో రూ. 15వేలల్లో, రెండు వేలరూపాయలను స్కూల్లు, మరుగుదొడ్ల నిర్వహణ నిధికోసం మినహాయిస్తున్నారు. కాగా జూన్ 28న సిఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.

అయితే కొంత మంది ఖాతాల్లో డబ్బలు జమ కాగా, మరికొంత మందికి జమ అయినట్లు స్టేటస్ చూపించినా ఖాతాలో డబ్బులు పడలేదు. ఇలా అయితే ఇప్పటివరకు అమ్మవడి డబ్బులు జమ కాకపోతే వారికి జూలై 10నుంచి 16వ తేదీ వరకు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నపేమెంట్స్ అన్నిఈ వారంలో తల్లుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ కి పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్ష సూచనా.. ఈ జిల్లాలకు అలెర్ట్..

Related Topics

Andhra Pradesh ammaodi

Share your comments

Subscribe Magazine