News

వడ్లు అమ్మిన అయిదు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు..

Srikanth B
Srikanth B
వడ్లు అమ్మిన అయిదు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు..
వడ్లు అమ్మిన అయిదు రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు..

ఇప్పటికే అకాల వర్షల కారణంగా పంట దెబ్బ తిని ఇబ్బంది పడుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది . గతంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తరువాత మూడు వారాలలో డబ్బులను రైతుల ఖాతాలో జమచేస్తుండగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజులలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది .

 

ఈ మేరకు ఈనెల 10న బుధ వారం ఒక్క రోజే 32,558 మంది రైతులకు రూ.474 కోట్ల నగదును వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రబీ సీజన్‌లో ఇప్పటివరకు రూ.1277 కోట్లను జమచేసినట్టు అధికారులు ప్రకటించారు. 82.58 శాతం మంది రైతులకు నగదు జమ కాగా.. కొందరు రైతుల విషయంలో ఎదుర వుతున్న సాంకేతిక సమస్యలను కూడా ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నట్టు- అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి .

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వీలైనంత తొందరగా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రాధాన్యత నిస్తున్నారు. రైతులు ధాన్యం అమ్మిన కేవలం ఐదు రోజుల్లో డబ్బులను జమ చేయనున్నారు . అకాల వర్షాల వల్ల ఎక్కువగా నష్టపోయిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు రూ.527 కోట్లు ఏలూరు జిల్లా రైతులకు రూ.296 కోట్లు తూర్పుగోదావరి రైతులకు రూ.258 కోట్లు కోనసీమ జిల్లా రైతులకు రూ.100 కోట్లను జమ చేసినట్టు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.


ఇది కూడా చదవండి .

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

Related Topics

paddy procurement

Share your comments

Subscribe Magazine