News

రైతులకు శుభవార్త..త్వరలో 43వేల ఎకరాల చుక్కల భూమి పత్రాలు పంపిణీ

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులకు మేలు జరిగేలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించేందుకు అధికార యంత్రాంగం సమగ్ర వ్యూహాలు రచిస్తోంది. ప్రభుత్వం మరియు రాజకీయ పార్టీ యంత్రాంగం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది, నియోజకవర్గ స్థాయిలో పనిచేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పర్యటనలో పలు విశేషమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ప్రధానంగా భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం విశేషం. అదనంగా, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం మరియు తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరించే వేడుకలు జరిగాయి. విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ మరియు వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌లకు శంకుస్థాపన చేయడం మరో ముఖ్యమైన సంఘటన.

ఈ నెల 12వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించనున్న వైఎస్ జగన్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా రైతులకు చుక్కల భూమి పత్రాలను ముఖ్యమంత్రి అందించనున్నారు.

ఇది కూడా చదవండి..

పాడి రైతులకు శుభవార్త: ఆవు-గేదెలకు క్రెడిట్ కార్డ్, గ్యారెంటీ లేకుండా 3 లక్షల రుణ సౌకర్యం..

ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జి.ఓ.163ని కూడా రూపొందించింది. కావలి నియోజకవర్గంలో గతంలో దాదాపు 6 వేల ఎకరాల్లో చుక్కల భూములు ఉండేవి, ఇది రైతులకు ప్రధాన సమస్యగా ఉండేది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం కొత్త జీవోను ప్రవేశపెట్టింది. ఈ జి.ఓ.163తో రైతులకు ఆ సమస్య తొలగిపోయింది. దీంతో ఇప్పుడు అదే నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగించనున్న వైఎస్ జగన్ సమక్షంలో ఈ భూములను రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మ స‌న్నాహాల‌ను ముఖ్య‌మంత్రి కార్య‌క్ర‌మాల క‌న్వీన‌ర్, శాసన మండలి స‌భ్యులు లేళ్ల అప్పిరెడ్డి ప‌రిశీలించారు.

దాదాపు 23,023 రైతులకు చెందిన 43,270 ఎకరాలను ఒకేసారి చుక్కల భూముల జాబితా నుంచి తొలగించటం జరిగింది. రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలు రాయిగా భావించాలి. ఇది రైతులకు ఎంతో ఊరట కలిగించే అంశం. రైతులను ఈ చుక్కల భూముల సమస్యలు ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమ్యసను ఎక్కువగా నెల్లురు జిల్లా రైతులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో నెల్లూరు రైతులు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వీఆర్‌ఓ, ఎమ్మార్వో, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్‌.. చివరకు సీసీఎల్‌ఏ ఆమోదం తర్వాత చుక్కల భూమి నుంచి తొలగించాలనే నిబంధనను ముఖ్యమంత్రి సరళీకరించారు.

ఇది కూడా చదవండి..

పాడి రైతులకు శుభవార్త: ఆవు-గేదెలకు క్రెడిట్ కార్డ్, గ్యారెంటీ లేకుండా 3 లక్షల రుణ సౌకర్యం..

Share your comments

Subscribe Magazine