News

రైతులకు శుభవార్త.. ఇకపై ఇంటి నుంచే ఈ సేవలు పొందవచ్చు..!

KJ Staff
KJ Staff

రైతులకు వ్యవసాయ అభివృద్ధి కోసం ఇచ్చే వ్యవసాయ రుణాలను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నారు. ఈ పథకం ద్వారా రైతులకు 3 లక్షల వరకు లోన్లు కేవలం 7 శాతం వడ్డీకే లభిస్తాయి. ఇచ్చిన లోను సరైన టైంలో చెల్లిస్తే 3 శాతం వరకు వడ్డీ తగ్గింపు ఉంటుంది. దీంతో రైతులకు 4శాతం వడ్డీకే సులభంగా రుణాలను పొందుతున్నారు.

ఇప్పటి వరకు రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండి తెలుసుకో వలసి వచ్చేది.తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది.ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంక్ బ్రాంచుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే మొత్తం సమాచారాన్ని తెలుసుకోవడానికి రైతులకు వీలు కల్పిస్తోంది.

అయితే దీని కోసం కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన రైతులు ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు ఇంటి నుంచే తెలుసుకోవచ్చు దీనికోసం ఎస్‌బీఐ యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్ ద్వారా రైతులు ఈ సేవలను సునాయాసంగా పొందొచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

Share your comments

Subscribe Magazine