దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు వంటకు ఇంట్లో వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగాయి.పెరిగిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. పెరిగిన గ్యాస్ సైసిన్దెర్ ధరల ఈ నెల 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వినియోగదారులకు దీని ద్వారా ఎల్పీజీ సిలిండర్ పై రూ.200 సబ్సిడీని అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇచ్చే సబ్సిడీని మరొక సంవత్సరం పొడిగిస్తున్నట్లు వినియోగదారులకు తెలిపింది.
ప్రధాని మంత్రి ఉజ్వల యోజక పథకాన్నీ 2016లో ప్రజలకు అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య లక్ష్యం వచ్చేసి, దేశంలో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎల్పీజీ అందుబాటులోకి తీసుకురావడం. ఈ పథకం కింద 2019-20లో ఎల్పీజీ వినియోగం అనేది 3.01 రీఫిల్స్ ఉండగా, 2021-22 సంవత్సరానికి అది 3.68కు చేరింది. సబ్సిడీలకు ఈ పథకం కింద ఉన్న లబ్ధిదారులందరూ అర్హులే.
ఇది కూడా చదవండి..
మహిళలకు శుభవార్త: నేడే మహిళల ఖాతాలో .. వైఎస్సార్ ఆసరా డబ్బులు
ప్రధాని మంత్రి ఉజ్వల యోజక పథకం కింద ఈ సంవత్సరం మర్చి 1వ తేదీకి 9.6 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఈ పథకానికి వ్యయం రూ.6,100 కోట్లు పెట్టారు. కానీ ఈ సంవత్సరం దీనిని పెంచుతూ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఈ పథకానికి వ్యయం వచ్చేసి రూ.7,680 కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ పథకం లబ్ధిదారులకు 14.2 కిలోల సిలిండర్కు రూ. 200 సబ్సిడీని ఏడాదికి 12 రీఫిల్స్కు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డబ్బులు అనేవి అర్హులైన వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.
ఇది కూడా చదవండి..
Share your comments