News

కౌలు రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మంజూరు..

Gokavarapu siva
Gokavarapu siva

కౌలు రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఇంగిరాల మురళీ, పంట సాగు ధ్రువీకరణ పత్రాలను జిల్లాలో అర్హత ఉన్న కౌలు రైతులు అందరికి మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రారంభించినట్లు ఇంగిరాల మురళీ గారు తెలిపారు.

కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాల మంజూరు, ఈ-క్రాప్ నమోదుకు సంబంధించిన పలు అంశాలపై గురువారం వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశమై చర్చించారు. జిల్లావ్యాప్తంగా 56 వేల మంది కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఇప్పటికే జిల్లాలో 47 వేల మంది కౌలు రైతులకు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినట్లు తెలిపారు.

భూయజమాని అనుమతితోనే కౌలు రైతులకు పంట సాగు ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడంతో ఎలాంటి సమస్యలు తలెత్తవని తెలిపారు. ఇంకా, ఈ పంట సాగు ధృవీకరణ పత్రాల కాల పరిమితి 11 నెలల వ్యవధి ఉంటుందని తెలిపారు. అదనంగా, పంట సాగు ధృవీకరణ పత్రాలు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులు రైతు భరోసా పథకం ద్వారా అందించే ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ రాయితీలకు అర్హులు అని అన్నారు.

ఇది కూడా చదవండి..

ప్రభుత్వం రైతులకు క్రాప్‌ బుకింగ్‌తో భరోసా.. ఇప్ప్పుడే నమోదు చేసుకోండి..

రైతులు పండించిన పంటలను వారు అమ్ముకుందుకు ప్రభుత్వం వారికి ఈ క్రాప్ బుకింగ్ చేస్తుంది. రైతులు పండించిన ప్రతీ పంట ఈ క్రాప్‌ బుకింగ్‌ చేసేందుకు వ్యవసాయశాఖ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఈ క్రాప్ బుకింగ్ కి రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. వ్యవసాయశాఖకు సంబంధించిన ఏ పథకం అమలు చేయాలన్నా ఈ క్రాప్‌ బుకింగ్‌ ఆధారంగా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి..

ప్రభుత్వం రైతులకు క్రాప్‌ బుకింగ్‌తో భరోసా.. ఇప్ప్పుడే నమోదు చేసుకోండి..

Share your comments

Subscribe Magazine