News

రానున్న 3 రోజులలో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్ష సూచనా !

Srikanth B
Srikanth B

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దక్షిణ ఛత్తీస్‌గఢ్ దానిని అనుకున్న ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భలపై నెలకొన్న అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది.

మరో 36 గంటల్లో ఆగ్నేయ మధ్యప్రదేశ్ వైపు కదులుతూ చివరికి వాయువ్య మధ్యప్రదేశ్ కు చేరుకుంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, యానాంలలో వీచనున్నాయి. ఏపీ, తెలంగాణ, యానాంలలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో సెప్టెంబర్ 14 వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిశాయి. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి.

సికింద్రాబాద్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన ప్రధాని:మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్సగ్రేషియా!

నేడు ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

సికింద్రాబాద్ ఘటన పై విచారం వ్యక్తం చేసిన ప్రధాని:మృతుల కుటుంబానికి 2 లక్షల ఎక్సగ్రేషియా!

Share your comments

Subscribe Magazine