News

నేడు రామగుండము ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని !

Srikanth B
Srikanth B
నవంబర్ 12 న  రామగుండము ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని !
నవంబర్ 12 న రామగుండము ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని !

తెలంగాణ రాజకీయం ఎప్పుడు మొత్తం రామగుండము ఎరువుల కర్మాగారం RFCL ( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) చుట్టే తిరుగుతుంది . నేడు నవంబర్ 11 2022 నాడు తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని RFCL ను జాతికి అంకితం చేయనున్నారు , అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్య మంత్రిని పిలువా లేదని అధికార పార్టీ విమర్శలు చేస్తుంది .

RFCL( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) ఎలా మొదలయింది ?

1961 లో కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తం గ నెలకొన్న ఎరువుల కొరతను అధిగమించాలని ,
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), రామగుండం (తెలంగాణ), గోరఖ్‌పూర్ (UP) & కోర్బా (ఛత్తీస్‌గఢ్)లో ఐదు యూనిట్ల లను నెలకొల్పి వీటి ద్వారా ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించాలిని వీటిని నెలకొల్పింది . దాదాపు ప్రారంభించిన 10 సంవత్సరాల తరువాత అందుబాతులోకి వచ్చిన కర్మాగారాలు అనేక టెక్నికల్ లోపాలతో అనుకున్న విధంగ ఉత్పత్తిని సాధించలేక పోయాయి దీనితో 1992 నుంచి నా 2002 వరకు ఆర్థిక ఇబ్బందుల మధ్య 2002 లో ఇవి మూతపడ్డాయి. అయితే 2010 వ సంవత్సరం లో ఈ అప్పులను ప్రభుత్వం మాఫీ చేస్తూ 2010 తరువాత వీటి పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం తెలిపింది . 2020 నాటికీ పునరుద్ధరణ పూర్తయిన RFCL( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) తిరిగి ప్రారంభమయి ఎరువుల ఉత్పత్తిని సాగిస్తుంది .

ప్రతి ఏటా పెరుగుతున్న తెలంగాణ వ్యవసాయ సాగు విస్తీర్ణం ...

RFCL( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) ఉత్పత్తి చేసే ఎరువులు :

ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( FCL) ద్వారా నెలకొల్పే సమయం లో అమోనియా , యూరియా , నైట్రిక్ ఆసిడ్ , ,నైట్రేట్, బై కార్బోనేట్ ఎరువులను ఉత్పత్తికి కోసం ఉద్దేశించబడి నప్పటికీ ప్రస్తుతానికి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
అమోనియా ఎరువులు , యూరియా లను ఉత్పత్తి చేస్తుంది . 290 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పని చేస్తున ఈ ఫ్యాక్టరీ 2020-2021 సంవత్సరం తో పోలిస్తే 1.9% ఉత్పత్తి పెరిగి 2020-21, 246.03 నుంచి 2022 సంవత్సరానికి 250. 76 మిలియన్ టన్నులకు చేరుకుంది . దీనిలో 31. 94 మిలియన్ టన్నులన రెండు తెలుగు రాష్ట్రాలు వివినియోగించుకుంటున్నాయి . ఇది మొత్తం ఉత్పత్తిలో దాదాపు 17. 5 శాతం గ వుంది .

వరి గడ్డి కలిస్తే రూ.2,500 జరిమానా .. ఎక్కడో తెలుసా !

Related Topics

RFCL Telangana

Share your comments

Subscribe Magazine