Agripedia

ప్రతి ఏటా పెరుగుతున్న తెలంగాణ వ్యవసాయ సాగు విస్తీర్ణం ...

Srikanth B
Srikanth B

తెలంగాణ రాష్ట్ర నిర్మాణం తరువాత తెలంగాణాలో వ్యవసాయం కొత్త పుంతలను తొక్కింది . ప్రతి ఏడు సాగువిస్తీర్ణం పెంచుకుంటూ సాగువిస్తరణము లో మరియు వ్యవసాయ ఉత్పత్తిలో దేశంలోనే అత్యంత వేగం గ అభివృద్ధి సాధించే దిశాగ అడుగులు వేస్తుంది . సాగు విస్తీర్ణం 2021-22లో 2.3 కోట్ల ఎకరాలకు చేరుకుంది, 2014లో 1.34 కోట్ల ఎకరాలు ఉండగా, మొత్తం వరి ఉత్పత్తి మాత్రమే 2014-15లో 68 లక్షల టన్నుల నుంచి 2021-22 నాటికి 2.49 కోట్ల టన్నులకు పెరిగింది. మొత్తం పంటల ఉత్పత్తి 3.5 కోట్ల టన్నులు దాటింది.

రాష్ట్రం ఆవిర్భావం తరువాత వ్యవసాయ రంగం ప్రాధాన్యం గ తెలంగాణ ముఖ్యమంత్రి 24 గంటల ఉచిత విద్యుత్ సాగునీటి ప్రాజెక్టులు పై దృష్టి కారణంగా వ్యవసాయ రంగం లో గణనీయమైన మార్పులు తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలలో కీలక పాత్ర పోషించాయి . 2.3 కోట్ల ఎకరాల వ్యవసాయ సాగు విస్తీర్ణంతో పాటు మరో 11.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 2014-15లో 41.83 లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం 44.7 శాతం పెరిగి 2021-22 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకుందని తెలంగాణ వ్యవసాయ అధికార విభాగం తెలిపింది . గత ఎనిమిదేళ్లలో సుమారు 6.06 కోట్ల టన్నుల వరిని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ.1.07 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తెలంగాణ తన వార్షిక బడ్జెట్ నుండి వ్యవసాయం మరియు సంబంధిత పథకాలపై గత కొన్నేళ్లుగా దాదాపు రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తోంది.

వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, రాష్ట్ర ప్రభుత్వం రూ. 36,703 కోట్లతో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది మరియు వ్యవసాయ రంగానికి సరఫరా చేసే విద్యుత్‌పై సబ్సిడీకి ప్రతి సంవత్సరం మరో రూ.10,500 కోట్లు అందజేస్తోందని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తం గ 12 శాతం పెరిగిన వరి సేకరణ , UP లో 60 % క్షీణత!

పెరిగిన వ్యవసాయ కార్యకలాపాల కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంతగా బలపడింది మరియు తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం 2014-15లో రూ. 1,12,162 నుండి రూ. 2,78,833కి రెట్టింపు అయింది . రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇతర కార్యక్రమాలను చేపట్టిందని అధికారులు తెలిపారు.

అధిక దిగుబడినిచ్చే మేలైన బొప్పాయి రకాలు పూర్తి వివరాలు!

Share your comments

Subscribe Magazine