కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులను అర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు కష్టకాలంలో ఆదుకునేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. అలాగే కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నాయి.
PMFBY పథకం ఎందుకు?
ఇక రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని రైతులందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థకంగా తోడ్పాటు అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం ద్వారా పంటలకు కేంద్ర ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తుంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు డబ్బులు వస్తాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి?
-ఆఫ్‌లైన్ ద్వారా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
-ఇక బ్యాంక్, CSC సెంటర్స్ లేదా PMFBY వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
-ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో అప్లై చేసుకోవచ్చు
1. www.pmfby.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
2.formers కార్నర్ మీద క్లిక్ చేయండి
3. లాగిన్ ఫర్ ఫార్మర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
4. ఆ తర్వాత మీ నెంబర్ కి వస్తే ఓటీపీని ఎంటర్ చేసి, ఆ తర్వాత మీ డీటైల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి
అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
1. www.pmfby.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
2. అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేయండి.
3. అప్లికేషన్ నెంబర్, captcha ఎంటర్ చేయండి
4. ఆ తర్వాత చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది.
Share your comments