కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులను అర్థికంగా అభివృద్ధి చేయడంతో పాటు కష్టకాలంలో ఆదుకునేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. అలాగే కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని పథకాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నాయి.
PMFBY పథకం ఎందుకు?
ఇక రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తోంది. ఈ పథకం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని రైతులందరూ ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయినప్పుడు రైతులకు ఆర్థకంగా తోడ్పాటు అందించడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం ద్వారా పంటలకు కేంద్ర ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తుంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినప్పుడు రైతులకు డబ్బులు వస్తాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి?
-ఆఫ్లైన్ ద్వారా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
-ఇక బ్యాంక్, CSC సెంటర్స్ లేదా PMFBY వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
-ప్రభుత్వ రంగ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకుల్లో అప్లై చేసుకోవచ్చు
Share your comments