News

KISAN CREDIT CARD :కిషన్ క్రిడిట్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం ఎలా ...?

Srikanth B
Srikanth B

కిషన్ క్రిడిట్ కార్డు పథకాన్ని కేంద్రప్రభుత్వం  1998 ఆగస్టు  నెలలో ప్రత్యక వ్యవసాయ  కమిటీ సిఫార్సుల మేరకు ప్రారంభించడం జరిగింది . ఈ  కిషన్ కార్డు పధకం ధ్వారా రైతులకు పంటను మొదలు పేట్టే  దశ నుంచి పూర్తి కోత దశ  వరకు అవసరమైన అన్ని రకాల పంట రుణాల ను  పొందడానికి వీలు కలుగుతుంది. 

కిషన్ క్రిడిట్ కార్డు ద్వారా పొందే వివిధ రకాల  రుణాలు 

1) వయ్వసాయ  రుణాలు 

2)వ్యవసాయ యాజమాన్యం కొరకు రుణాలు 

వ్యవసాయ అనుబంధ రంగాల కొరకు రుణాలు :

1) డైరీ ప్లస్ ( పాడి పరిశ్రమ కొరకు )

2)బాయిలర్ ప్లస్ ( కోళ్ల పెంపకం కొరకు)

3) ధాన్యాగారాల నిర్మాణం

4) పండ్ల తోటల పెంపకం కోసం 

5)బిందు సేద్యం కొరకు 

6) వ్యవసాయ ఉత్పత్తుల మార్కటింగ్ కొరకు

ఎవరు అర్హులు : వ్యవసాయ  సంబంధిత పనులు చేసే ప్రతి ఒక్కరు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ధ్రువపత్రాలు ,అర్హతలకు సంబందించిన అంశాలు క్రింద పేర్కొనబడినవి . 

అవి :వయసు 18-75 మధ్య వయసు వారు భూమికి సంబందించిన పత్రాలు మరియు దానితో పాటు ఆధార్ కార్డు , పాన్ కార్డు ,మొబైల్ నెంబర్ ,బ్యాంకుకు సంబందించిన ధ్రువపత్రాలు కలిగినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు . 

దరఖాస్తు చేసుకున్న విధానం :లబ్ధిదారులు  దీనిని ఆన్లైన్ ,ఆఫ్లైన్ లో చేసుకోవచ్చు , ఆన్లైన్ చేయాలి అనుకునే వారు ఆయా బ్యాంకులకు సంబంధించి వెబ్సైటు ల లో "కిసాన్ క్రిడిట్ కార్డు" విభాగం లో "అప్లయ్ బటన్ "ను నొక్కి మన యొక్క పేరు చిరునామా సంబందించిన వివరాలు జత పరచి "ప్రొసీడ్ " ను క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు స్వీకరించబడుతుంది. బ్యాంకు వారు దానిని దృవీకరించిన తరువాత ఫోను ధ్వారా మిమల్ని సంప్రదిస్తారు , "ఆఫ్ లైన్ " ద్వారా చేయాలి అనుకునే వారు నేరుగా సంబంధిత బ్యాంకును  సంప్రదించాలి . ఈ క్రిడిట్ కార్డు రైతులు 10000-50000 వేల వరకు ఋణ సదుపాయం కలుగుతుంది . 

కిసాన్ క్రిడిట్ కార్డు అందించే బ్యాంకులు : ఈ కిసాన్ క్రిడిట్ కార్డును కొన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ బ్యాంకులు అందిస్తున్నాయి అవి ,  బ్యాంకు ఆఫ్ ఇండియా ,బ్యాంకు ఆఫ్ ఇండియా ,నాబార్డు ,యాక్సిస్  బ్యాంకు ,ఇండస్ట్రియల్ డవలాప్ మెంట్ బ్యాంకు , నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా.

Share your comments

Subscribe Magazine