హైదరాబాద్: తెలంగాణలోని ఆరు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) ఎల్లో (Yellow) అలర్ట్ఆజారీచేసింది . ఆరు జిల్లాలు పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ మరియు ఖమ్మం లో జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది.
IMD ప్రకారం, వాతావరణ స్థితి ని,తీవ్రతను బయటకు వెల్లడించడానికి వాతావరణ శాఖ హెచ్చరికలలో రంగు సంకేతాలు ఉపయోగించబడతాయి. పసుపు హెచ్చరిక అంటే రానున్న కలం లో వాతావరణ మార్పును ,రాబోయే వాతావరణ సంఘటన యొక్క సంభావ్య ప్రభావాన్ని సూచించడానికి ఇది ఉపయోగించబడుతుంది.
కాగా, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం, గత 24 గంటల్లో, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలోని గుండాలలో 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అత్యధికంగా జగిత్యాలలోని ఎండపల్లిలో 39.9 డిగ్రీల సెల్సియస్, మరియు రంగారెడ్డిలోని షాబాద్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 18.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుండి 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Share your comments