News

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 3 లక్షల రుణం పొందాలంటే.. ఇలా అప్లై చేయాలి!

KJ Staff
KJ Staff

రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రతి ఏటా ఆరు వేల రూపాయలను వారి ఖాతాలో జమ చేస్తోంది.ఈ క్రమంలోనే రైతులు పంటలను సాగు చేయడం కోసం పెద్దఎత్తున అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ విధంగా పంట కోసం బయట రుణాలు పొందకుండా ప్రభుత్వం నుంచి 3 లక్షల వరకు రుణం పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకు కల్పించింది. అయితే ఈ మూడు లక్షల రుణాన్ని పొందాలంటే రైతులకు తప్పనిసరిగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉండాలి. మరి పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా పొందాలి.ఈ రుణం కోసం ఎలా అప్లై చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

పీఎం కిసాన్ యోజన కిసాన్ క్రెడిట్ కార్డుతో లింక్ చేయబడి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా రైతులు
KYC చేయాల్సిన పనిలేదు కేవలం సాధారణ ఫారం పూర్తి చేస్తే ఎంతో సులభంగా కిసాన్ క్రెడిట్ కార్డు పొందవచ్చు.Pmkisan.gov.in వెబ్ సైట్ నుంచి ఈ ఫారంను డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే రైతులు వయసు కనీసం 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్న వారు మాత్రమే అర్హులుగా ప్రకటించింది.

60 సంవత్సరాల కంటే పైబడిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుదారునికి మరొకరిని నామినిగా ఉంచాలి. కిసాన్ క్రెడిట్ ద్వారా రైతులు ప్రభుత్వం నుంచి 3 లక్షల రుణం పొందవచ్చు. ఈ మూడు లక్షల రుణానికి రైతులు 4 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.ఈ రుణం మొత్తం 9 శాతం వడ్డీ ఉంటే ప్రభుత్వం 2శాతం వడ్డీ రాయితీని భరించి రైతులకు 7 శాతం వడ్డీకి ఇస్తుంది.రైతులు సరైన సమయానికి అప్పులు చెల్లిస్తే మరో 3 శాతం వడ్డీ రాయితీ కలుగుతుంది. అంటే రైతులు వారు తీసుకున్న రుణానికి 4 శాతం వడ్డీ చెల్లించి తిరిగి ప్రభుత్వానికి కట్టవలసి ఉంటుంది.

కిసాన్ క్రెడిట్ ద్వారా కేవలం వ్యవసాయం చేసే రైతులు మాత్రమే కాకుండా మత్స్య సంపదను పెంచే రైతులు కూడా రుణం పొందవచ్చు. అయితే మత్స్య సంపద చేసే వారికి రెండు లక్షల వరకు మాత్రమే రుణం పొందే అవకాశం ఉంది. ఒకసారి కిసాన్ కార్డు పొందిన తర్వాత అది కేవలం ఐదు సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తరువాత కిషన్ కార్డును రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కిసాన్ కార్డు కోసం మీరు కో-ఆపరేటివ్ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్, SBI, బ్యాంక్ ఆఫ్ ఇండియా , IDBI బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కడైతే మీరు ఈ కార్డును పొంది ఉంటారు అక్కడే తిరిగి ఐదు సంవత్సరాలకు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

Share your comments

Subscribe Magazine