రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి మరో వైపు కొన్ని చోట్ల రాత్రి అయితే వర్షాలు కురుస్తున్నాయి దీనితో రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం నెలకొంది , మరోవైపు రానున్న 4 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ సూచనలు జారీ చేసింది , వరి కోతకు వున్నా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీచేసింది .
ఒక మోస్తరు నుంచి ఈదురు భారీ వర్షాలు కురువనునట్లు వాతావరణ శాఖ వెల్లడించింది రంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రానున్న ఆది ,సోమ ,మంగళ ,బుధ వారాలవరకు మోస్తరు వర్షాలు కురవచ్చని దీనితోపాటు ఉష్ణోగ్రతలు ఉక్కపోత కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది .
అధికారం లో రాగానే 2 లక్షలు రుణమాఫీ !
గత రెండ్రోజులుగా ఎండలు కాస్త తగ్గినా.. ఉక్కపోత ఎక్కువగానే ఉంటోంది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 42.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో 42.4 డిగ్రీలు, ఖమ్మం జిల్లా ప్రకాశ్‌నగర్, భద్రాద్రి జిల్లా మణుగూరు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జంబుగ, జయశంకర్ జిల్లా మహదేవ్‌పూర్‌లో 42.2, సూర్యాపేట జిల్లా మునగాలలో 42.1, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42 డిగ్రీల వరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి .
Share your comments