ప్రతీ ఏడాది ఏడాది మే 1 న కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలోని ఏ సంస్థయినా అభివృద్ధిలోకి రావాలన్న కార్మికులు తమ శ్రమను ధారపొయ్యకుండా సాధ్యపడదు. అటువంటి శ్రామికుల శర్మను గుర్తించి వారికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేయడానికి మే 1 న కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాము.
మే డే నిర్వహించడానికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిగా కార్మికుల హక్కులు గురించి వారికి తెలియపరచడానికి, మరియు కార్మికులు సమాజానికి చేస్తున్న శ్రమను గుర్తించి వారిని సన్మానించడానికి ఈ రోజును ప్రత్యేకంగా భావిస్తారు. కార్మిక దినోత్సవం జరపాలన్న ఆలోచన ఒక ఉద్యమం నుండి పుటింది. ఒకప్పుడు అమెరికా వంటి దేశాల్లో ప్రజలను బానిసలుగా మార్చి వారితో గొడ్డు చాకిరీ చేయించేవారు. దీనిని అరికట్టి కార్మికలకు నిర్ణిత పనివేళ కల్పించాలంటూ, మే 1, 1886 న సుమారు 2 లక్షల మంది కార్మికులు ఉద్యమం మొదలుపెట్టారు. దీని ఫలితంగా కార్మికులకు 8 గంటలు పని వేళలు లభించాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని అప్పటినుండి మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాము.
వ్యవసాయానికి శ్రామికుల చేయూత:
వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్న పని. కర్షకులు పంటలు పండించి దేశానికి అన్నం పెడుతుంటే, శ్రామికులు అన్నదాతలకు చేయూతగా నిలిచి వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్నారు. భారత దేశాన్ని వ్యవసాయ దేశంగా పరిగణిస్తారు. అరవై శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయాన్ని తమ జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు. వీరిలో అధిక భాగం వ్యవసాయ కార్మికులే. వ్యవసాయానికి కూలీలే ప్రధమంగా అవసరం. యాంత్రీకరణ అభివృద్ధి చెంది ఎన్ని కొత్త వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చిన, కూలీలా స్థానాన్ని భర్తీ చెయ్యలేవు. వ్యవసాయ కార్మికుల శ్రమ ఫలితంగానే ఈ రోజు మనం ఆహరం తినగలుగుతున్నాం.
మహిళల భాస్వామ్యం:
మహిళలు తమ కుటుంబం కోసం అహర్నిశలు పాటు పడతారు. వారు కుటుంబం కోసం చేసే శ్రమకు ఎటువంటి గుర్తింపు ఉండదు. ఇంటి పనులతో పాటు, కుటుంబ బాధ్యతలను సమానంగా నెరవేర్చగలిగే శక్తి మహిళలకు మాత్రమే ఉంది. వ్యవసాయ పనుల్లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయంలో పురుషులకంటే మహిళలే ఎక్కువ పని చేస్తున్నట్లు ఎన్నో గణాంకాలు సూచిస్తున్నాయి. వ్యవసాయంలో 94% పనులు మహిళలే పూర్తిచేస్తున్నారు. ఇంటికి మరియు ఎన్నో సేవలు అందిస్తున్న మహిళలందరికి ఈ కార్మిక దినోత్సవం నాడు కృతజ్ఞతలు తెలుపుదాం.
కార్మిక దినోత్సవాన్ని భారత దేశంతో పాటు అనేక దేశాల్లో జరుపుకుంటారు. ఈ రోజు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కార్మికులను సత్కరిస్తారు. అంతే కాకుండా ఇదే రోజు అనేక కార్మిక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి.
Share your comments