News

20201-22 లో వ్యవసాయ ఎగుమతుల ద్వారా రికార్డు వ్యయం గడించిన భారత్

S Vinay
S Vinay

Directorate General of Commercial Intelligence and Statistics విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం, వ్యవసాయ ఎగుమతులు 2021-22లో 19.92% పెరిగి $50.21 బిలియన్లకు చేరుకున్నాయి సుమారుగా మన దేశ కరెన్సీ లో 3 లక్షల 79 వేల కోట్లు.

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు (సముద్ర చేపల మరియు తోటల ఉత్పత్తులతో సహా) 2021-22 సంవత్సరానికి USD 50 బిలియన్లను దాటాయి, గతం లో ఎన్నడూ లేని విధంగా ఇది అత్యధిక స్థాయిని సాధించింది.బియ్యం (USD 9.65 బిలియన్లు), గోధుమలు (USD 2.19 బిలియన్లు), చక్కెర (USD (USD 4.6 బిలియన్లు) మరియు ఇతర తృణధాన్యాలు (USD 1.08 బిలియన్) వంటి ప్రధానమైన ఎగుమతులు చేయబడ్డాయి. గోధుమలు 273% కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేశాయి. 2020-21లో ఉన్న $568 మిలియన్ల నుండి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 2021-22 నాటికి $2119 మిలియన్లకు చేరుకుంది. ఈ ఉత్పత్తుల ఎగుమతుల పెరుగుదల పంజాబ్, హర్యానా,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల రైతులకు మేలు చేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ వరి మార్కెట్‌లో దాదాపు 50% భారతదేశానిదే.

సముద్ర ఉత్పత్తుల ఎగుమతి USD 7.71 బిలియన్లు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర మరియు గుజరాత్ వంటి తీరప్రాంత రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూర్చింది. సుగంధ ద్రవ్యాల ఎగుమతులు వరుసగా రెండవ సంవత్సరం USD 4 బిలియన్లకు చేరుకున్నాయి. కొన్ని అవరోధాలు ఉన్నప్పటికినీ కాఫీ ఎగుమతులు మొదటిసారిగా USD 1 బిలియన్‌ని దాటాయి.

 

భారత్ అత్యధిక ఎగుమతులు సాధించడం వెనక department of commerce మరియు దాని వివిధ ఎగుమతి ప్రమోషన్ ఏజెన్సీలైన APEDA, MPEDA మరియు వివిధ కమోడిటీ బోర్డుల యొక్క నిరంతర కృషి ఉంది.

వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా పరిపాలనలను నిమగ్నం చేసేందుకు ప్రత్యేక కృషి చేసింది.ఎగుమతుల నుండి రైతులు ప్రయోజనం పొందేలా చూడడానికి, వాణిజ్య శాఖ నేరుగా రైతులకు మరియు FPOలకు export market ని అనుసంధానాన్ని చేయడంలో ప్రత్యేక కృషి చేసింది. రైతులు, ఎఫ్‌పిఓలు/ఎఫ్‌పిసిలు, సహకార సంఘాలు ఎగుమతిదారులతో సంభాషించడానికి farmer connect portal ని ఏర్పాటు చేసింది. ఈ విధానం వల్ల ఇప్పటివరకు గుర్తింపు పొందని ప్రాంతాల నుండి వ్యవసాయ ఎగుమతులు జరుగుతున్నాయి. అనంతపూర్ (అరటి), కృష్ణా & చిత్తూరు (మామిడి), వారణాసి (తాజా కూరగాయలు, మామిడి), నాగ్‌పూర్ (నారింజ), లక్నో (మామిడి), తేని (అరటి), షోలాపూర్ (దానిమ్మ), వంటి ఎగుమతులు జరిగాయి. అనంతపురం నుండి JNPT, ముంబైకి అరటిపండ్లను రవాణా చేయడానికి ప్రత్యేకంగా 'హ్యాపీ బనానా' రైలు నడుపబడుతుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుత సంక్షోభం సమయంలో కూడా, గోధుమలు మరియు ఇతర ఆహార ధాన్యాల సరఫరా కోసం ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది.

మరిన్ని చదవండి.

ప్రకృతి వ్య్వవసాయానికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహం సుమారుగా....

Share your comments

Subscribe Magazine