ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న పిఎం కిసాన్ నిధిని అతి త్వరలో విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీం కి మీరు అర్హులో కాదో? తెలుసుకోండి ఇలా.
మన దేశంలోని, చిన్న, మరియు సన్నకారు రైతులకు ఆర్ధిక సహకారాన్ని అందించేందుకు, 2018 డిసెంబర్ లో మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సమ్మాన్ నిధి యోజన ప్రారంభించింది. అర్హత కలిగిన రైతులు అందరికి ఒక ఏడాదికి 6000రూ అందించాలి అనేది ఈ స్కీం యొక్క లక్ష్యం. ఈ స్కీం లో భాగంగా ప్రతి సంవత్సరం 2000రూ చొప్పున మూడు విడతల్లో రైతుల కాతాలో నగదు జమ అవుతుంది. క్రిందటి సంవత్సరం 15 నవంబర్ లో రైతుల కాతాలో నగదు జమకాగా 8కోట్ల మంది రైతులు ఈ స్కీం ద్వారా లబ్ది పొందారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న రైతుల కాతాలో డబ్బు జమ అయ్యే అవకాశం ఉంది.
రైతులకు బ్యాంకు అఫ్ ఇండియా వారి ఫెస్టివ్ ఆఫర్లు.. వివరాలు ఇవే
PM కిసాన్ 16వ విడతకు అర్హులు వీళ్ళే...
ఈ స్కీంకు అర్హత సాధించడం కోసం, ముందుగా మీరు భారతీయ పౌరుడు అయ్యిఉండాలి. చిన్న మరియు మధ్యకారు రైతు వర్గానికి చెంది ఉండాలి. అతిముఖ్యంగా రైతు పేరు మీద సాగు భూమి నమోదై ఉండాలి. రైతు యొక్క ఏ ఒక్క కుటుంబ సభ్యుడు అయినా రాజ్యాంగబద్దమైన విధుల్లో ఉంటారో వారు ఈ స్కీం కు అర్హులు కారు, అలాగే ప్రభుత్వ మరియు ఇతర చట్టబద్ధమైన విధులు నిర్వహించే వారు మినహాయించడతారు.
డబ్బు జమ అయ్యిందో లేదో తెలుసుకోవడం ఎలా?
అర్హత ఉన్న రైతులు తమ దగ్గరలో ఉన్న PMKSNY నోడల్ ఆఫీసర్ ని కానీ,రెవిన్యూ ఆఫీసర్ ను కానీ సంప్రదించి నమోదు చేసుకోవచ్చు .వీటితో పాటు PM కిసాన్ యోజన వెబ్సైటు లోకి వెళ్లి అక్కడ NEW Farmer Registration(న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫై ) క్లిక్ చేసి మీ వివరాలు నింపి నమోదు చేసుకునే అవకాశం ఉంది.
అవసర అయ్యే డాక్యూమెంట్లు:
- ఆధార లేదా పాన్ కార్డు.
- భూమి యాజమాన్యాన్ని దృవీకరించే డాక్యూమెంట్లు .
- ఇంకా మీ బ్యాంకు అకౌంట్ వివరాలు.
ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా సులువుగ డబ్బును పొందేందుకు ప్రవేశపెట్టిన e-KYC ని పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వం సూచించింది. మీ eKYC ని పూర్తి చెయ్యడానికి PMKSNY వెబ్సైటు లోకి వెళ్లి అక్కడ అడిగిన వివరాలు పూర్తి చెయ్యవలసి ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న ఇంకా మిగతా సమాచారం కోసం pmkisan-ict@gov.in ను EMAIL ద్వారా సంప్రదించవచ్చు. మరింత సమాచారం కోసం హెల్ప్లైన్ నెంబర్ :155261 or 1800115526 (Toll-Free) or 011-23381092.
Share your comments