News

వ్యవసాయంలో... చిరు సాయం మందు పిచికారీ చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఇంటర్ విద్యార్థి!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రపంచంలో కేవలం పురుషులు మాత్రమే కాకుండా మహిళలు కూడా అన్ని రంగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఇప్పటికే అన్ని రంగాలలో మహిళలు తమదైన ముద్ర సాధించారు. అన్ని రంగాలలో మహిళలు తమ చూపిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం పురుషులకే అధిక ప్రాధాన్యత దక్కుతుంది. అయితే వ్యవసాయంలోనూ మేము తీసిపోమంటూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.ఈ ఇంటర్ విద్యార్థి.

తెలంగాణలోని నందిపేట మండలం, పూర్ గ్రామానికి చెందిన రాములు, ముత్తేమ్మ దంప‌తుల‌కు ముగ్గురు సంతానం.. వీరికి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు. చిన్న కూతురు రాధా ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అయితే రాధను ఆ తల్లిదండ్రులు తమ కొడుకుగా భావించారు. రాధ కూడా తను తల్లిదండ్రులకి కొడుకుగా చేయాల్సిన బాధ్యతలను నెరవేరుస్తుంది. ఓవైపు చదువుతూనే మరోవైపు వ్యవసాయంలో తమ తల్లిదండ్రులకు తనవంతు సాయం చేస్తోంది.

ఈ క్రమంలోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేస్తూ పంట పొలానికి మందులు పిచికారి చేస్తూ తమ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలబడుతూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వ్యవసాయరంగంలో వస్తున్నటువంటి ఆధునిక పద్ధతులను తెలుసుకుంటూ వ్యవసాయం కొనసాగిస్తున్నానని రాధ తెలిపారు. ఈ విధంగా ఇంటర్ చదివే ఈ విద్యార్థి పొలం పనులు చేస్తూ ఎంతోమందికి వ్యవసాయంపై ఆసక్తిని కనబరుస్తున్నారు.

Share your comments

Subscribe Magazine