భారత దేశమంతటా పార్లిమెంట్ ఎన్నికలు మొదలవ్వనున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పార్లిమెంట్ ఎన్నికలతో పటు లోకసభ ఎన్నికలు కూడ జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ మార్చ్ 16 న విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుండి ఏడు దశల్లో ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4 వ తేదీన విడుదల వెల్లడించనున్నారు.
ఎన్నికల కోసం ఇప్పటికే చాల మంది తమ సొంతూళ్లకు వెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో మరొక్క ఆసక్తికరమైన విష్యం ఏమిటంటే, మొత్తం ఓటర్లలో అధిక శాతం యువకులు మరియు కొత్తగా ఓటర్ ఐడి గుర్తింపు వచ్చినవారే. ఇది ఇలా ఉంటె, చాల మంది 17 ఏళ్ళు నిండిన వారికీ కూడా ఓటర్ ఐడి కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అనే సందిగ్నంలో పడ్డారు. దీనికి సమాధానంగా ఎలక్షన్ కమిషన్, 17 ఏళ్ళు నిండిన వారుకూడా ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చి అని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఓటర్ల జాబితాను అప్డేట్ చేస్తారు, కనుక 17 ఏళ్ళు నిండిన వారు ఏప్రిల్ 1న , జులై 1న, అక్టోబర్ 1నాటికీ 18 ఏళ్ళు నిండేలా చూసుకుని దరఖాస్తు చేసుకోవాలి.
Read More....
YSRCP: పార్టీ అభ్యర్థుల తుది జాబితా ఇదే....
ఆన్లైన్ లో ఓటర్ ఐడి కోసం నమోదు చేసుకుందాం అనుకునే వారు https://voterportal.eci.gov.in ఈ లింక్ నుండి ఫామ్ 6 డౌన్లొడ్ చేసుకొని అవసరమైన వివరాలు అన్ని నింపి తిరిగి మల్లి అదే వెబ్సైటులో అప్లోడ్ చెయ్యాలి. వివరాలను దృవీకరించడానికి అవసరమైన పాత్రలను కూడా ఈ ఫామ్ తో జోడించవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ దగ్గరలోని, మీసేవ కేంద్రం ద్వారా కూడా ఓటర్ ఐడి కోసం నమోదు చేసుకోవచ్చు.
అంతే కాకుండా అధిక జనాభా ఉన్నా భారత దేశంలో, ఓటర్ ఐడి లో తప్పులు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓటర్ ఐడి కార్డులో, మీ పేరును కానీ, అడ్రస్, లేదా మరేవిధమైన మార్పుల కోసమైనా సరే పైన ఇచ్చిన పోర్టల్ లోగినాయి, ఫామ్ 8 డౌన్లోడ చేసుకొని అవసరమైన వివరాలను నింపవలసి ఉంటుంది. మీ వివరాలు అన్ని కరెక్టుగా ఉంటె అప్డేటెడ్ వివరాలతో, కొత్త ఓటర్ కార్డు మీ చిరునామాకు పంపిస్తారు.
Share your comments