భారత దేశంలోని రైతులందరిని ఒక్క చోటకు చేర్చి, వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృషి జాగరణ్ పూనుకుంది. గత 27 సంవత్సరాలుగా రైతుల అభ్యున్నతికి కృషి జాగరణ్ ఎన్నో కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డులను ప్రారంభించింది. ఈ కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించడంతో, ఈ సంవత్సరం ఈ అవార్డు ప్రధానోత్సవాన్ని భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించబోతుంది. అయితే ఈ అవార్డుల విశిష్టతను రైతులకు నేరుగా తెలియపరిచేందుకు, MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలుపెట్టింది.
కిసాన్ భరత్ రధం భారత దేశం లోని అన్ని ప్రాంతాలకు తిరిగి, రైతులకు MFOI అవార్డుల ప్రత్యేకతను తెలియపరుస్తుంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం పశ్చిమ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలో మొదలైన ఈ యాత్ర, మహారాష్ట్ర వరకు సాగనుంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం మద్య ప్రదేశ ధాటియా ప్రాంతానికి చేరుకుంది. STIHL కంపెనీ సహకారంతో ధాటియా లోని డెభై లో నిర్వహించిన రోడ్ షో దిగ్విజయంగా ముగిసింది. ఈ కార్యక్రమం విజయంలో, భగవత్ ప్రసాద్ విశ్వకర్మ ఎంతగానో తోడ్పడ్డారు.
STHIL కంపెనీ వారు తమ వ్యవసాయ పనిముట్ల పనితీరును రైతులకు వివరించారు. అంతేకాకుండా, ఈ పనిముట్ల యొక్క వినియోగాన్ని రైతులు స్వయంగా చూసి తెలుసుకునేందుకు వారి పొలాల్లో యంత్రాలను ఉపయోగించి చూపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులందరికీ MFOI అవార్డుల గురించి మరియు వాటిని పొందేందుకు కావాల్సిన అర్హతల గురించి రైతులకు వివరించడం జరిగింది.
6000కిలోమీటర్లు పూర్తిచేసుకున్న MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర:
Share your comments