భారత ప్రభుత్వానికి చెందిన నూతన పునరావృత్త ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ ఇ) జాతీయ బయోఎనర్జీ (జీవ ఇంధన) కార్యక్రమాన్ని 2 నవంబర్ 2022న ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2021-22 నుంచి 2025-26 వరకు ఈ జాతీయ బయోఎనర్జీ కార్యక్రమాన్ని ఎంఎన్ఆర్ ఇ కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రెండు దశలలో అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం తొలి దశను రూ. 858 కోట్ల వ్యయంతో ఆమోదించారు.
జాతీయ బయోఎనర్జీ కార్యక్రమం దిగువన పేర్కొన్న ఉప పథకాలను కలిగి ఉంటుంది:
వ్యర్ధాల నుంచి ఇంధన కార్యక్రమం (పట్టణ, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్ధాలు/ అవశేషాలపై కార్యక్రమం) భారీ బయోగ్యాస్, బయోసిఎన్‌జి, విద్యుత్ ప్లాంట్ల ( ఎంఎస్‌డబ్ల్యు నుంచి విద్యుత్ ప్లాంట్లను మినహాయించి) ఏర్పాటు చేసేందుకు మద్దతునిస్తుంది.
బయోమాస్ కార్యక్రమం (బ్రికెట్స్ & గుళికల తయారీకి మద్దతునిచ్చే పథకం, పరిశ్రమలలో బయోమాస్ (బాగాసేతర) ఆధారిత పునరుత్పత్తిని ప్రోత్సహించడం) విద్యుత్ ఉత్పత్తి, నాన్ బాగాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులలో ఉపయోగం కోసం బ్రికెట్లు & పెల్లెట్ల ఉత్పత్తిని ఏర్పాటు చేయడం కోసం మద్దతు ఇస్తుంది.
తెలంగాణలో 8 కొత్తగ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి!
గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ స్థాయి, మధ్య స్థాయి బయోగాస్ కేంద్రాలకు బయోగాస్ కార్యక్రమం మద్దతునిస్తుంది.
కార్యక్రమాల మార్గదర్శకాలు //mnre.gov.in/లో అందుబాటులో ఉన్నాయి.
ఇంధన పునరుద్ధరణ కోసం దేశంలో భారీగా లభ్యమయ్యే బయోమాస్, పశువుల పేడ, పారిశ్రామిక, పట్టణ జీవవ్యర్ధాలను ఉపయోగించుకోవడానికి, ఎంఎన్ఆర్ఇ 1980ల నుండి భారతదేశంలో బయో ఎనర్జీని (జీవ ఇంధనాన్ని) ప్రోత్సహిస్తోంది.
ఎంఎన్ఆర్ఇ అందిస్తున్న ప్రధాన తోడ్పాటు ఏమిటంటే, బయోగ్యాస్, బయోసిఎన్‌జి, పట్టణ, పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్ధాల నుంచి విద్యుత్/అవశేషాలు/ వాటి మూలధన వ్యయాన్ని/ వడ్డీని తగ్గించి ప్రాజెక్టు సాధ్యతను పెంచడం.
Share your comments