News

చిన్న పెట్టుబడిదారులు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు స‌రికొత్త మోడల్‌ను రూపొందిస్తాం: శ్రీ నితిన్ గడ్కరీ

Srikanth B
Srikanth B

చిన్న పెట్టుబడిదారులు మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కొత్త మోడల్‌ను రూపొందిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఫిక్కీ మూడో ఎడిషన్ 'రోడ్స్ అండ్ హైవేస్ సమ్మిట్‌'ను ఆయ‌న ప్రారంభించారు.


సామాన్య ప్రజలు తమ పెట్టుబడులపై నిశ్చయమైన రాబడిని పొందేందుకు త‌గినట్టుగా అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రపంచంలోనే రెండో అత్యున్నత రహదారుల అనుసంధాన‌త‌ కలిగి ఉన్న దేశం మ‌న‌దేన‌ని అన్నారు, 2024 చివరి నాటికి మ‌న దేశీయ రోడ్డు నెట్‌వర్క్‌ రెండు లక్షల కిలోమీటర్లకు విస్తరించాల్సిన సమయం ఇదేనని మంత్రి అన్నారు. లాజిస్టిక్స్ ఖర్చును 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గించే సవాలు గురించి మంద్రి శ్రీ గడ్కరీ మాట్లాడారు.

ట్రాన్సజెండర్లకు ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు

లాజిస్టిక్స్ ధర తగ్గింపును సాధించేందుకు సమీకృత విధానం అవసరమని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, ఎల్‌ఎన్‌జీ మరియు ఇథనాల్, మిథనాల్, హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలు ఖర్చుతో కూడుకున్నవి, స్థిరమైనవి కాబట్టి వాటిని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు.

ట్రాన్సజెండర్లకు ఆయుష్మాన్ భారత్- పీఎంజే కింద సమగ్ర ఆరోగ్య సేవలు

Share your comments

Subscribe Magazine