News

రైతులకు గమనిక.. వెంటనే నమోదు చేసుకోండి..

Gokavarapu siva
Gokavarapu siva

వ్యవసాయ శాఖ రైతులకు ముఖ్యమైన విషయాన్ని తెలిపింది. పసుపు పంటను సాగు చేస్తున్న రైతులు వెంటనే సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. మార్కెఫెడ్ జిల్లా మేనేజరు పవన్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యవసాయశాఖ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న మండలాలైన సీతారామపురం, దుత్తలూరు, ఉదయగిరి, రికుంటపాడుకు చెందిన పసుపు పంటను సాగు చేసిన రైతులు రైతు భరోసా కేంద్రాల్లో సీఎం యాప్‌లో వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఇక్కడ మొత్తం నాలుగు మండలాల్లో కలిపి పసుపు పంటను రైతులు 180 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ 180 ఎకరాల నుండి సుమారుగా
ప్రాధమిక అంచనాగా ఆరువేల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు తెలిపారు. నేడు క్వింటా పసుపుకు బహిరంగ మార్కెట్ లో రూ.5200 ధర ఉందని తెలిపారు.

కానీ ప్రభుత్వం రైతులకు కిట్టుబాటు అయ్యేలా కనీస మద్దతు ధర క్వింటా పసుపుకు రూ.6,850 ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర బయట మార్కెట్ ధర కన్నా అధికంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కూడా వారికి వచ్చిన పంట దిగుబడిని బయట మార్కెట్ లో విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇది కూడా చదవండి..

అధిక లాభాలు తెచ్చిపెడుతున్న మల్చింగ్‌ గురించి తెలుసా ?

ఉదయగిరిలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్‌ ద్వారా ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం ఈ మండలాల్లో రైతులు పసుపు తవ్వకాలను జరుపుతున్నారు. ఇప్పటికే ఈ క్రాప్‌లో నమోదైన రైతులు తమ పరిధిలో ఉన్న ఆర్‌బీకేలకు వెళ్లి సీఎం యాప్‌లో వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం మే నెల రెండో వారం నుండి మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పరిచి ఉదయగిరిలో పసుపు కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఇది కూడా చదవండి..

అధిక లాభాలు తెచ్చిపెడుతున్న మల్చింగ్‌ గురించి తెలుసా ?

Related Topics

turmeric crop farmers

Share your comments

Subscribe Magazine