News

OIL PALM:పామ్ ఆయిల్ సాగుకై ఎకరాకు 49 వేల సబ్సిడీ

S Vinay
S Vinay

TELANGANA: తెలంగాణ లో 2022-23 సంవత్సరానికి సుమారుగా 2.50 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ను సాగు చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది దీని కొరకైఈ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే కోటికి పైగా ఆయిల్ పామ్ మొలకలను దిగుమతి చేసుకుంది.

పామ్ ఆయిల్ సాగుకి రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీని అందిస్తుంది విత్తనాలు, ఎరువులు,రసాయనాలు, సాగునీరు మరియు ఇతర నిర్వహణ కార్యక్రమాల కొరకై సుమారుగా రూ. 49,000/- (48,917/-) ను ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలను అందిస్తుంది అంతే కాకుండా సంవత్సరానికి రూ. 4,200/- చొప్పున నాలుగు సంవత్సరాలకు రూ.16,000/- రాయితీని కూడా అందిస్తుంది.

వ్యవసాయ శాఖ 9.46 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ ని సాగు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ఇందులూ భాగంగా 2022-23వ సంవత్సరానికి పామ్ ఆయిల్ సాగుకి 2.50 లక్షల ఎకరాలను కేటాయించింది.దీనికి 1.62 కోట్ల మొక్కలు అవసరం అని అంచనా వేసింది. కాగా ఇప్పటికే కోటి మొలకలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో విత్తనాలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా.తెలంగాణ ప్రభుత్వం 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. వీటిని నర్సరీల్లో దాదాపు ఒక సంవత్సరం పాటు పెంచి రైతులకు సరఫరా చేయనున్నట్లు తెలంగా వ్యవసాయ శాఖ వెల్లడించింది.

అంతే కాకుండా రైతులకు పామ్ ఆయిల్ సాగులో యాజమాన్య పద్దతులను,మెళకువలను మరియు ఇతర జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహనా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ తెలిపింది.

ఒక నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ లో పామ్ ఆయిల్ 2027 చివరి నాటికి 92 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.భారతదేశంతో పాటు చైనా, థాయిలాండ్, ఇండోనేషియా మరియు మలేషియా వంటి దేశాలు పామ్ ఆయిల్ లో అత్యధిక మార్కెట్ ని కలిగి ఉన్నాయి.

మరిన్ని చదవండి.

KRISH VIGNAN KENDRA:ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం

Related Topics

oil palm subsidy farmers telangna

Share your comments

Subscribe Magazine