News

పాకిస్థాన్ దేశ రికార్డు ని బద్దలకొట్టిన మన జాతీయ జెండా!

S Vinay
S Vinay

శనివారం నాడు బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఏకకాలంలో 78,000 త్రివర్ణ పతాకాలను ఎగురవేయడంతో పాకిస్థాన్ ప్రపంచ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857లో జరిగిన తిరుగుబాటులో స్వాతంత్ర సమరయోధుడు అయిన వీర్ కున్వర్ సింగ్ 164వ వర్ధంతి సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 78,000 మందికి పైగా భారతీయులు ఏకకాలంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు, 18 సంవత్సరాల క్రితం లాహోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో 56,000 మంది పాకిస్థానీయులు తమ జాతీయ జెండాను రెపరెపలాడించినప్పుడు పాకిస్తాన్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు.

బారీ సంఖ్యలో హాజరైన ప్రజలు ప్రత్యేకంగా బ్యాండ్‌లు ధరించారు.ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌
కొరకు పెద్ద సంఖ్యలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ 77,700 జెండా రెపరెపలను చూపించినప్పుడు ప్రేక్షకులు ఏంటో ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ వీర్ కున్వర్ సింగ్ ఎనభై ఏళ్ల వయసులో స్వాతంత్య్ర పోరాటం చేశారని, ఆయన తన చేతిని నరికి గంగకు సమర్పించారని,స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను యువ తరానికి గుర్తు చేయడం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో కీలకమైన అంశమని అమిత్ షా అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు కేంద్రమంత్రులు ఆర్కే సింగ్, నిత్యానంద్ రాయ్, బీహార్ ఉప ముఖ్యమంత్రులు తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి, బీజేపీ రాజ్యసభ ఎంపీ, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చదవండి

"పాడి పరిశ్రమ రైతులకు ఆదాయాన్ని సమకూర్చే ఆదనపు వనరు" - ప్రధాని మోదీ

Related Topics

national flag world record

Share your comments

Subscribe Magazine