News

"పాడి పరిశ్రమ రైతులకు ఆదాయాన్ని సమకూర్చే ఆదనపు వనరు" - ప్రధాని మోదీ

Srikanth B
Srikanth B

సాంప్రదాయ వ్యవసాయం తో పోల్చితే, పాడి పరిశ్రమ రైతు ఆదాయాన్ని పెంచే వనరులుగా దోహదపడుతుంది అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెల్లడించారు . గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా డియోదర్‌లో బనాస్ డెయిరీ సుమారు 610 కోట్లతో నిర్మించిన కొత్త డెయిరీ హబ్ ను మరియు బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దేశానికి అంకితం చేశారు .

"బనాస్ డెయిరీ దేశంలో కొత్త ఆర్థిక శక్తిని స్థాపిస్తుంది " అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, కంపెనీ అభివృద్ధి కార్యకలాపాలు రైతులను బలోపేతం చేస్తాయి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇక్కడ, మన ఆత్మనిర్భర్ భారత్  కు ఇదొక ఉదాహరణగ నిలుస్తుంది అని అయన వెల్లడించారు .

"నేడు, భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. కోట్లాది మంది రైతులు తమ జీవనోపాధి కోసం పాడి పరిశ్రమ ఆధారపడినప్పుడు, భారతదేశం సంవత్సరానికి 8.5 లక్షల కోట్ల విలువైన పాలను ఉత్పత్తి చేస్తుందని, "చాలా మంది ప్రజలు, పెద్ద ఆర్థికవేత్తలు కూడా దీనిని పట్టించుకోవడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

 ప్రధానమంత్రి మోడీ ప్రకారం, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా (సోమ్‌నాథ్ నుండి జగన్నాథ్ వరకు), ఆంధ్రప్రదేశ్ మరియు జార్ఖండ్‌ ప్రభుత్వాలు పశువుల పెంపకందారులకు సహాయం అందిస్తున్నాయి .

వ్యవసాయం మరియు పశుపోషణపై ముఖ్యమైన శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్న రైతులకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను కూడా  దేశానికి ప్రధాని మోదీ అంకితం చేశారు . ఇది దాదాపు 1,700 గ్రామాలను మరియు 5 లక్షల మంది రైతులను అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అంతేకాకుండా, పాలన్‌పూర్‌లోని బనాస్ డెయిరీ ఫెసిలిటీలో, జున్ను ఉత్పత్తులు మరియు పాలవిరుగుడు పౌడర్‌ల తయారీకి సంబంధించిన సౌకర్యాలను ప్రధాని మెరుగుపరచారు. దామాలో బయోగ్యాస్ మరియు సేంద్రియ ఎరువుల ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

PMEGP:ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం...25 లక్షల లోపు రుణాలు! 35% సబ్సిడీ!

Related Topics

Dairy Farming PM Modi

Share your comments

Subscribe Magazine