News

వరి పంటలో సుడి దోమ ఉదృతి నివారణ తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు!

Srikanth B
Srikanth B

వరిపంటను తీవ్రవంగా నష్టపరుస్తున్న సమస్యల్లో సుడిదోమ ఒకటి. ఇది వరికంకులు ఏర్పడే దశలో పంటను ఆశిస్తుంది. ఈ కీటకాలు ఆకులు, కాడల మధ్య ప్రాంతంలో కాండాల ఎగువ భాగంలో కనబడతాయి.

ఆకుల నాళాల కణద్రవ్యాన్ని తినేసి కణజాలలను నష్టం కలిగిస్తాయి. దీంతో మొక్క నీరు, పోషకాలను కోల్పోవటం, ఆకులు వాడిపోవటం , మొక్కల ఎదుగుదల లేకపోవటం జరుగుతుంది. వరి కంకులపైన దాడి చేస్తాయి. దీంతో కంకులు గోధుమ రంగులో, నల్లటి చీలిన గింజలు తో కనిపిస్తాయి. దిగుబడి తగ్గుతుంది. తెగులు తీవ్రత అధికమైతే మొక్కలు చనిపోతాయి.

పిల్ల పురుగులు మొదట్లో తెలుపు రంగులో ఉండి పెరిగిన తరువాత గోధుమ రంగులోకి మారుతాయి.పెద్ద పురుగుల రెక్కలు కలిగి గోధుమ రంగులో ఉంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో పాటు ఆగస్టులో 3 నుంచి 4 వందల వరకు వర్షపాతం, పగటి ఉష్ణోగ్రతలు 25 – 36, రాత్రి పూట 21 – 23 సెల్సియస్‌ మధ్య ఉన్నప్పుడు దోమ వ్యాప్తి చెందుతుంది. దోమలో రెండు రకాలు ఉంటాయి. తెల్ల వీపు, గోధుమ రంగు దోమలు ఉంటాయి. వానాకాలంలో వరిలో నవంబరు వరకు ఉంటుంది.పిల్ల, పెద్ద దోమలు నీటి పైభాగంలో దుబ్బుల మొదళ్ల దగ్గర ఆశించి రసం పీలుస్తాయి. ఈ ప్రభావంతో పంట లేత పసుపు రంగుకు మారుతుంది.ఉధృతంగా ఉంటే పంటలో నీటిపై గమనిస్తే తెట్టువలే తేలుతూ కనిపిస్తాయి.

మరో ఘనతను సాధించిన వరంగల్ ..యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీస్ లోచోటు

నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:

ఈ పురుగును తట్టుకునే రకాలైన చైతన్య, క్రిష్ణవేణి, విజేత, ఇంద్ర, ప్రతిభ, అమర, కాటన్ దొర సన్నాలు, శ్రీధృతి రకాలను నాటుకోవాలి. సిఫార్సు మేరకు నత్రజని సంబంధమైన ఎరువులను వేయాలి. పొలాన్ని తరచు ఆరబెట్టాలి. లామ్డా సైవాలోత్రిన్‌, బీటీ సైస్లుథ్రిన్‌ వంటి సింథటిక్‌ పైర థ్రాయిడ్స్‌ మందులను వాడినప్పుడు పురుగు ఉధృతి అధికమవుతుంది. పైరు తొలిదశలో దోమ ఉధృతికి దోహదపడే మందులను వాడకుండా పిలక దశలో దుబ్బుకు 10-15 అంకురం నుంచి ఈనిక దశల్లో దుబ్బుకు 20 – 25 దోముల గమనిస్తే సస్యరక్షణ చేపట్టాలి.

తొలి దశలో ఎస్పేట్‌ ఎసిఫేట్‌ 75 ఎస్‌పీ 1.5 గ్రా. లేదా ఇథపెన్‌ప్రాక్స్‌ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి అధికమైనప్పుడు డైనోటెప్యూరాన్‌ 0.4 గ్రా. లేదా బ్యు ప్రొఫిజిన్‌ 1.6 మి.లీ లేదా పై మెట్రోజైన్‌ 0.60 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ + ఎథిప్రోల్‌ 0.25గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వీటితోపాటు బూప్రోఫెజిన్ 1.6 మి.లీ. (లేదా) డీనోటెప్యురాన్ 0.4 గ్రా.లు (లేదా) ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 0.25 గ్రా (లేదా) పైమెట్రోజైం 0.6 గ్రా.లు (లేదా) ఎసిఫేట్ 1.5 గ్రా. (లేదా) మోనో క్రోటోఫాస్ 2.2 మి.లీ., + డ్రైక్లోరోవాస్ 1.0 మి.లీ / 1 లీ॥ కలిపి మొక్క మొదళ్ళలో పిచికారి చేయాలి.ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటను వదలాలి.

మరో ఘనతను సాధించిన వరంగల్ ..యునెస్కో గ్లోబల్ లెర్నింగ్ సిటీస్ లోచోటు

Share your comments

Subscribe Magazine