News

వచ్చే వారంలో రైతుల అకౌంట్లలోకి రూ.2 వేలు

KJ Staff
KJ Staff

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది.  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ఆర్థిక సహాయం చేస్తోన్న విషయం తెలిసిందే. రూ.2 వేలు చొప్పున మూడు విడతలుగా ఈ నగదును నేరుగా లబ్ధిదారులైన రైతులు బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున కేంద్రం ఇస్తుంది

అయితే ఈ పథకం మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏడు విడతల సొమ్మును రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించగా.. త్వరలో 8వ విడత నగదును రైతులు ఖాతాల్లో జమ చేయనుంది. వచ్చే వారంలో 8వ విడత నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వేయనున్నట్లు కేంద్రం వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్‌లో తెలిపారు.

హోలీకి ముందు లేదా తర్వాత ఈ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. పీఎం కిసాన్ పథకం కొనసాగుతూనే ఉంటుందని, పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో రాష్ట్రాలు అప్‌లోడ్ చేసిన లబ్ధిదారుల జాబితా ప్రకారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే తాము కూడా వివిధ ఏజెన్సీల ద్వారా లబ్ధిదారుల జాబితాను వెరిఫై చేసిన అనంతరం డబ్బులు జమ చేస్తామన్నారు. `
 
అటు పీఎం కిసాన్ నగదును పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే వచ్చేవారంలోనే రానున్న పీఎం కిసాన్ డబ్బులు మీకు పడతాయో లేదో తెలుసుకునేందుకు ఈ క్రింది విధంగా చేయండి.

- పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి
- ఆ తర్వాత అందులోని బెనిఫీషియరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి.  
-ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి
-ఆ తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితాలో మీరు ఉన్నారో.. లేదో తెలుస్తోంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉంటే.. మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి                                                                                       

Share your comments

Subscribe Magazine