News

పీఎం కిసాన్ డబ్బులు పడని వారి ఖాతాలో జమ చేశారు... మీకు పడ్డాయో లేదో ఇలా తెలుసుకోండి!

KJ Staff
KJ Staff

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని చిన్న సన్నకారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలనే లక్ష్యంతో ప్రారంభించి అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పథకం"ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన".ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 8విడుదల్లో దాదాపు 12 కోట్లు మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా20 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలకు పంపిణీ చేశారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన
పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే మొత్తం డబ్బులు ఒకేసారి కాకుండా సంవత్సరానికి మూడు విడతల్లో ఒక్కొక్కసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్‏లో వేస్తున్నారు.ఇప్పటికే 8 విడుదల్లో డబ్బులు పంపిణీ చేశారు.

తాజాగా 9వ విడత పీఎం కిసాన్ నగదును
విడత నిధులను విడుదల చేశారు.ఇప్పటికే చాలామంది రైతులు పీఎం కిసాన్ నగదును అందుకున్నారు. కొందరికి మాత్రం బ్యాంక్ లావాదేవీల్లో అవాంతరాల,మరి కొన్ని కారణాల వల్ల పీఎం కిసాన్ డబ్బులు ప్రాసెస్ చేయడంలో సమస్య ఎదురైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లావాదేవీలు ఫిబ్రవరి 1, 2019 నుంచి జూన్ 30, 2021 మధ్యలో మొత్తం 61,04,877 విఫలం అయ్యాయి. ఇలా ఇబ్బందులు తలెత్తిన ఎకౌంట్లను పరిశీలించి మళ్ళీ వారి ఖాతాలకు డబ్బులు జమ అయ్యేలా రీ ప్రాసెస్ చేశారు

ఈ విధానం వల్ల అర్హత ఉన్న చాలా మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వారి అకౌంట్లో జమ అయినట్లు తెలుస్తోంది. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నారేమో ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మరే ఇతర సమాచారాన్ని తెలుసుకోవాలని దగ్గర్లోని ఈ సేవా కేంద్రాలకు వెళ్లి తెలుసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine