News

PMFBY :1 కోటి కి చేరినప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లబ్దిదారులు !

Srikanth B
Srikanth B

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMPBY) గురించి రైతులలో అవగాహన పెంచడానికి,  బరి కార్యాచరను ప్రకటించనుంది దాదాపు కోటి మంది నమోదు చేసుకున్న రైతుల  ఇంటింటికి తిరిగి కర పాత్రలను  అందించే విధం గ ప్రణాళిక రచిస్తోంది . ఏ కార్యాక్రమాన్నికేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఫిబ్రవరి 26న ప్రారంభించనున్నారు, అయితే ఈ కార్యక్రమం యొక్క విజయం ఆయా రాష్ట్రాల భాగసౌమ్యం పై  ఆధారపడి ఉంటుంది అన్ని అయన వెల్లడించారు . 

ఒక అధికారి ప్రకారం,  ( PMPBY ) అమలుపరిచే మొత్తం 20 రాష్ట్రాలలలో  "ఇంటింటికి"  వెళ్లి కర పత్రాలను పంచే విధంగా  బీమా కంపెనీలను సమన్వయం చేయడానికి ( PMPBY ) మొత్తం 20 రాష్ట్రాలలలో  మంత్రిత్వ శాఖ లేఖ రాసింది.

ప్రస్తుత రబీ సీజన్ లో, 19రాష్ట్రాల్లో 98.65 లక్షల మంది రైతులు( PMPBY ) లో  చేరారని అంచనా. కర్ణాటక ఇంకా డేటాను అందించలేదు. ఈ రైతుల నుండి వచ్చిన 3.30 కోట్ల దరఖాస్తులలో 73.5 శాతం రుణగ్రహీతలు, మిగిలిన 26.5 శాతం రుణాలు తీసుకోనివారుగా ఉన్నారు . ఈ కార్యక్రమం కింద రుణగ్రహీతకాని రైతులను ఈ  పథకం కింద చేర్చాలా లేదా అనే అంశం కేంద్రం రాష్ట్రాలకు వదిలివేసింది.

"రుణగ్రహీతకాని రైతులు సాధారణంగా e  సేవా కేంద్రాల (సిఎస్ సిలు) ద్వారా నమోదు చేసుకుని, అక్కడి నుండి తమ రసీదులను పొందుతారు."  "అయితే, రుణగ్రహీత రైతులు రుణ బ్యాంకుల ద్వారా నమోదు చేయబడతారు  అయితే లబ్ధిదారులైన రైతులకోసం

ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ ఫార్మెట్ ను ప్రచురించింది, ఈ  పాలసీ పేపర్లను ప్రతి రైతుకు ఇంటింటికి వెళ్లి అందించనున్నట్లు  సమాచారం.  ఈకార్యక్రమాన్ని విజయవంతం గ నిర్వహించడానికి గ్రామ పంచాయితీ సభ్యులు, సంబంధిత శాఖల నుంచి క్షేత్ర స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, , కృషి విజ్ఞాన కేంద్రాలను ఆహ్వానించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. ప్రకృతి వ్యవసాయం మరియు వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం గురించి సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి రాష్ట్రాలు ఈ సమావేశాలను ఉపయోగించాలని కేంద్రం పేర్కొంది .

ఇంకా చదవండి.

eNAM లోనమోదు చేసుకున్న రైతు లకు ఇప్పుడు పూర్తిస్థాయిలో అన్ని సేవలు! (krishijagran.com)

Share your comments

Subscribe Magazine

More on News

More