News

వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడంలో మరో కీలక నిర్ణయం...

KJ Staff
KJ Staff

కేంద్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించిన విషయం తెలిసిందే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్ జిల్లా అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.బహిరంగ మార్కెట్ లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఉన్నట్లయితే రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకోవచ్చు లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తాయి.

దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.రబీలో పండిన వేరు శనగను ఏపీ సీడ్స్ ద్వారా సేకరించి ఖరీఫ్లో రైతులకు రాయితీతో పంపిణీ చేయనున్నారు. గతంలో పాక్షికంగా మాత్రమే కొనుగోలు చేసేవారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు గత రెండేళ్లుగా అన్ని రకాల పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేస్తూ సకాలంలో సొమ్ము జమ చేస్తుండటంతో రైతుల్లో విశ్వాసం పెరిగింది.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం
ఉద్యాన రైతులను ఆదుకునే విధంగా ఉద్యాన ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించింది. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన పంట వేరుశనగకు క్వింటాల్ రూ.5,500 చొప్పున మద్దతు ధర ఖరారు చేశారు. గత ఏడాది క్వింటాల్ రూ.5,275 ఉండగా.ఇప్పుడు రూ.275 పెంచారు. అలాగే గత ఏడాది కన్నా కందులకు రూ.300, పత్తికి రూ.200, వరి ధాన్యానికి రూ.72, మొక్కజొన్నకు రూ.20 ప్రకారం మద్దతు ధర పెంచారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యాన ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ధరను కల్పించింది. ఉద్యాన పంటల్లో చీనీ, బత్తాయి క్వింటాల్ కు రూ.1,400, అరటి రూ.800, ఉల్లికి రూ. 770, ఎండుమిర్చికి రూ.7 వేలు, కొర్ర, అరికెలు, ఊదర్లకు రూ.2,500, సోయాబీన్ రూ.3,950, పసుపు పంటకు రూ.6,850 కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరిగింది.

Share your comments

Subscribe Magazine