News

నిరుద్యోగులకు సీమ పందుల పెంపకంతో పసిడి పంట

KJ Staff
KJ Staff

నిరుద్యోగులకు సీమ పందుల పెంపకం అనేది వరంగ మారింది. స్వయం ఉపాధి పొందాలి అనుకునేవారికి ఎంతగానో ఉపయోగపడేవిధముగా ఈ సీమ పందుల పెంపకం అనేది వేగముగా అభివృద్ధి చెందుతుంది. సీమ పందుల మాంసం అనేది మాంసకృతుల లోపాన్ని నివారించడంలో బ్రాయిలర్ కోళ్ల తరువాత స్థానంలో ఉంది. గతంలో ఈ వ్యాపారాన్ని అసహ్యించుకున్నవారు సైతం రుణాల కోసం బ్యాంకులు , మండల అభివృద్ధి అధికారులు , పశు వైద్యశాలల చుట్టూ తిరుగుతున్నారు. మేలురకం జాతి సీమ పందులు మార్కువెట్లొకి వచ్చిన తరువాత మాంసానికి డిమాండ్ మరింత పెరిగింది.

ముక్త్యాల సీమ పందుల కేంద్రం

రాష్ట్రంలో ప్రభుత్వ సీమ పందుల కేంద్రాలు ముక్త్యాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా గొన్నపాలెం , విజయనగరం జిల్లాలో మాత్రమే ఉన్నాయి. వీటిలో ముక్త్యాల ఫార్మ్ అతి పెద్దది. జగ్గయ్యపేట సమీపంలో ముక్త్యాల గ్రామంలో 20 ఎకరాల స్థలంలో ముక్త్యాల రాజా వారు 75 ఎళ్ల కృత్యహం ఈ ఫార్మ్ ను ఏర్పాటు చేసారు. ఈ ఫారంలో ముఖ్యంగా లార్జ్ వైట్ యార్క్ ఫైర్ పందులను మరియు అమెరికా, జెర్మనీ , ఆస్ట్రేలియా, కేరళ జాతులను మాత్రమే పెంచేవారు.

తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం

ఈతకు వచ్చేసి 9 లేదా 10 పిల్లలను పొందవచ్చు. అధిక లాభాన్ని ప్రతి ఈత తరువాత పొందవచ్చు. ఈ సీమ పందులు 90 కిలోల వరకు సులభముగా పెరుగుతయి. ఈ సీమ పందులు కిలో బరువు పెరగడానికి 3-4 కిలోల దాణా ను ఉపయోగించుకుని తక్కువ సమయములో మాంసంగా మార్చగలిగే శక్తీ ఉన్న పెంపుడు జీవులు. రెండు నెలల పిల్లలను ఒక్కొకటి రూ. 1900 చొప్పున అమ్ముతారు. 4, 5 నెలల్లో 50 కిలోల బరువు దాటుతుంది. మార్కెట్లో కిలో మాంసం రూ.300, వారు (స్కిన్) కిలో రూ.400 ఉంటుంది. 50 కిలోల పందిని రూ.15 వేలకు అమ్ముకోవచ్చు.

ఇది కూడా చదవండి ..

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?

పోషణ మరియు ఆహరం

సీమ పందులకు ఆహారంగా ధాన్యపు గింజలు, వేరుశెనగ, తవుడు, విటమిన్, సొయా బీన్స్, ఎమినో ఆసిడ్స్ కలిపి తయారుచేస్తారు. ఎక్కువ ఖర్చు కడుడదు అనుకుంటే హోటళ్ల నుంచి వృధా ఆహారాన్ని సేకరించి వాటికీ ఆహరంగా వాడచ్చు. లేదా మొక్కజొన్న , సజ్జలు ,మిశ్రమంగా చేసి ఆహారంగా వాడచ్చు. శాత్రవేత్తలు ఆహారపదార్ధాలలో వైరస్ ఉంటున్నందున దానిని ఉడికించి చలార్చిన తర్వాతా పెట్టడం ఉత్తమమని అంటున్నారు.

ఇది కూడా చదవండి ..

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?

Related Topics

gunia pigs

Share your comments

Subscribe Magazine