News

అంతరిక్షంలో పండించిన టొమాటో భూమికి తీసుకురానున్న శాస్త్రవేత్తలు!

Srikanth B
Srikanth B
Tomato cultivation in space
Tomato cultivation in space

అంతరిక్షం లో అద్భుతాలను కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఎల్లపుడు ప్రయత్నిస్తుంటారు , విశ్వంపై మానవ మనుగడకు కావాల్సిన అన్ని పరిశోధనలు చేస్తూనే వున్నారు , అంతరిక్షములో ప్రయోగం చేసిన ఒకటైన కూరగాయల పెంపకం గురించి మనం ఇక్కడ చూద్దాం !


తాజాగా ఇలా పరిశోధనల్లో భాగంగా పండించిన టొమాటోలను భూమి మీదకు తీసుకురాబోతున్నారు శాస్త్రవేత్తలు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో ప్రత్యేకమైన గ్రీన్ హౌజ్ మాడ్యూల్ లో వ్యోమగాములు ఈ టొమాటోలను పండించ,ారు. మరగుజ్జు రకం టొమాటోలను పెంచినట్లు నాసా ఒక బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది.డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా భూమి పైకి రాబోతున్నాయి. ఈ రోజు(ఏప్రిల్ 15) స్పేస్ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్రూ ద్వారా దాదాపుగా 2,000 కిలోల సామాగ్రి, సైంటిఫిక్ ప్రయోగాలకు సంబంధించిన వస్తువులను మోసుకొస్తోంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.15కి ఐఎస్ఎస్ నుంచి ఈ స్పేస్ క్రాఫ్ట్ బయలుదేరుతుంది.

రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు.. వాతావరణ శాఖ సూచనలు జారీ !

టొమాటోలతో పాటు జపాన్ ఎయిరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ(జేఏఎక్స్ఏ) అంతరిక్షంలో రూపొందించిన స్పటికాలను భూమికిపైకి రాబోతున్నాయి. ఈ టొమాటోలను 104 రోజులపాటు అంతరిక్షంలోని పండించి పోషక విలువలను చూసారు , ఇవి పోషకాలను కల్గి ఉన్నట్లు గుర్తించిన పరిశోధకులు వీటిని వ్యోమగాముల కు ఆహారంగా అందించేందుకు ఈ పరిశోధనను చేసినట్లు తెలిపారు .

గతంలో పాలకూర, ముల్లంగి మరియు గోధుమలతో సహా అంతరిక్షంలో మొక్కలను పెంచడంలో ఇప్పటికే అనేక విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. 2021లో, మొదటి అంతరిక్షంలో పెరిగిన టమోటాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పండించబడ్డాయి. పరిశోధన కొనసాగుతున్నందున, భూమికి మించిన దీర్ఘకాలిక మిషన్‌ల కోసం స్థిరమైన ఆహార వ్యవస్థలను సృష్టించే లక్ష్యంతో అంతరిక్షంలో మరిన్ని పంటలను పరీక్షించి, పండించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో నాలుగు రోజులు వానలు.. వాతావరణ శాఖ సూచనలు జారీ !

Related Topics

Polar space satellites

Share your comments

Subscribe Magazine