News

రైతులకు షాక్.. సిబిల్ ఉంటేనే పంట రుణాలు.! బ్యాంకు అధికారుల కొత్త తీరు..

Gokavarapu siva
Gokavarapu siva

తాజాగా బ్యాంకు అధికారులు కొత్త నియమాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు గృహ, వాహన రుణాల మంజూరు చేయాలంటే సిబిల్‌ స్కోర్‌ చెక్ చేసే వారు. కానీ ఇప్పుడు పంట పండించే రైతులకు కూడా పంట రుమాలును మంజూరు చేయాలంటే వారికి సిబిల్‌ స్కోర్‌ ఉండాల్సిందే అని అంటున్నారు. సిబిల్‌ స్కోర్‌ లేదంటే వారికి రుణాలు మంజూరు చేయడానికి అధికారులు తిరస్కరిస్తారు.

రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు పెట్టిన కొత్త నిబంధన ఇది. ప్రస్తుతం వానాకాలం సీజన్లో పంట రుణాల కోసం వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లిన రైతులకు బ్యాంకర్లు కొత్త మెలిక పెట్టారు. ఐదేళ్ల క్రితం ప్రభుత్వం రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన హామీతో బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించని రైతులకు ఇప్పుడు సిబిల్ రూపంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.

ఈ చర్య రుణగ్రహీతలలో ఆర్థిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఉన్నప్పటికీ, వాణిజ్య ప్రయోజనాల కోసం పెట్టిన సిబిల్ నిబంధనను పంట రుణాలకు పెట్టడంతో రైతులకు ఇది ఆటంకాలు కలిగిస్తుంది, తద్వారా రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడుతున్నారు.

గతంలో, వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు మరియు గృహాలకు సంబంధించిన రుణాలు మినహాయించి, బ్యాంకులు రైతులకు వారి CIBIL స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యేకంగా పంటల కోసం రుణాలు అందించేవి. ఈ రుణ ప్రక్రియలో, కొన్ని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలను తాకట్టుగా ఉంచుకునేవి, అయితే మరికొన్ని బ్యాంకులు పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆమోదించి రైతులకు తిరిగి ఇచ్చేసేవి. పట్టాదారు పాస్‌ పుస్తకంలో సదరు రైతు పేరిట ఉన్న భూ విస్తీర్ణం పరిమితి మేరకు బ్యాంకర్లు పంట రుణాలను ఇస్తారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకనుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం..!

బ్యాంకులు విధించిన నిబంధనల ప్రకారం రైతులు పంట రుణం పొందిన నాటి నుంచి ఏడాదిలోగా తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం రుణమాఫీ ప్రకటనపై ఎదురుచూడడంతో కొందరు రైతులు వడ్డీ కూడా చెల్లించకుండా ఎంచుకున్నారు. పర్యవసానంగా, ఈ చెల్లించని కారణంగా ఈ రైతుల CIBIL స్కోరు తగ్గింది. పైగా వరుస మూడేళ్లు లావాదేవీలు లేని ఖాతాలు ఎన్పీ (నో ప్రొటెక్ట్‌) పరిధిలోకి వెళ్తున్నాయి.

పంట రుణాలు పొందడానికి బ్యాంకర్లు సిబిల్‌తో పాటు కొత్త కొర్రీని కూడా జోడించినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా పంట రుణాలకు వీటితో పాటు జామీను(పూచీకత్తు)ను కూడా ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు సమాచారం. పంటరుణం పొందాలంటే కుటుంబ సభ్యులలో వారసులైన వారు లేదా ప్రభుత్వ ఉద్యోగులతోనైనా జామీను సంతకం చేయించే నిబంధనను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకనుండి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అల్పాహారం..!

Related Topics

crop loans farmers new rule

Share your comments

Subscribe Magazine