News

బ్యాన్ చేయబడిన ఎండోసల్ఫాన్ పురుగుల మందును వాడుతున్నారా...నష్టాలు ఏంటో తెలుసుకోండి!

S Vinay
S Vinay

ఎండోసల్ఫాన్ అనేది ఆర్గానోక్లోరిన్ పురుగుమందు , ఇది మొదట 1950లలో ప్రవేశపెట్టబడింది. దీనిని వాణిజ్య పరంగా థియోడాన్ అని పిలుస్తారు.

ఈ పురుగుమందును ముఖ్యంగా పత్తి, జీడి, పండ్లు, తేయాకు, వరి, పొగాకు మొదలైన పంటలపై తెల్లదోమ, అఫిడ్స్, బీటిల్స్, పురుగులు మొదలైన చీడపీడల నివారణకు దీనిని పిచికారీ చేస్తారు.అయితే దీని వాడకంలో దుష్ప్రభావాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగ మానవ ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇది న్యూరోటాక్సిసిటీ, శారీరక వైకల్యాలు, విషప్రయోగం వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకి దారి తీస్తుంది.ఎండోసల్ఫాన్ వ్యవసాయ ఉత్పత్తుల్లో పేరుకుపోయి మరింత వినాశనానికి కరకం అవుతుంది.ఎండోసల్ఫాన్ వలన శారీరక వైకల్యాలు, క్యాన్సర్, పుట్టుకతో వచ్చే రుగ్మతలు మరియు మెదడు మరియు నాడీ వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది.

అయితే ఈ ఎండోసల్ఫాన్ వాడకం వలన సంభవించే నష్టాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రసాయన పురుగు మందుని నిషేదించింది.ఇది చౌక ధరల్లో లభించడం వలన రైతులు అప్పట్లో పెద్ద ఎత్తున వాడారు కానీ ఎండోసల్ఫాన్ ఉత్పత్తి, అమ్మకం మరియు వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు గతం లోనే ఉత్తర్వులు జారే చేసింది.

కేరళ ప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు:
ఎండోసల్ఫాన్ పురుగుమందుల బారిన పడిన బాధితుల కోసం "వాస్తవంగా ఏమీ చేయడం లేదు" అని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. మూడు నెలల్లో బాధితులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చెల్లించాలని రాష్ట్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు 2017 తీర్పును కేరళ ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. తీర్పు వెలువడిన ఐదేళ్ల నుంచి 3,704 మంది బాధితుల్లో కేవలం ఎనిమిది మందికి మాత్రమే పరిహారం చెల్లించినట్లు కోర్టు గుర్తించింది. 2015లో దాని హానికరమైన ఆరోగ్య ప్రభావాలను పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఎండోసల్ఫాన్ తయారీ, అమ్మకం, వినియోగం మరియు ఎగుమతిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది.

మరిన్ని చదవండి.

ద్రాక్ష సాగుకి అనువైన నేలలు మరియు వాతావరణం!

Share your comments

Subscribe Magazine