News

ఇకపై రైతులకు అందుబాటులోకి...సోలార్ పవర్..!

KJ Staff
KJ Staff

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇప్పటికే రైతులకు రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయానికి అవసరమైన విత్తనాలను ఎరువులను అతి తక్కువ ధరలకు రైతులకు అందిస్తోంది.అదేవిధంగా రైతులు వ్యవసాయం చేయడానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి మొదటగా 10000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల
6400 మెగావాట్ల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.

ఈ క్రమంలోనే జిల్లాకు 1200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని కేటాయించారు. ఈ క్రమంలోనే 600 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని దొనకొండ మండలం రుద్ర సముద్రం ఆల్ట్రా మెగా సోలార్‌ పార్కు నుంచి ఉత్పత్తి చేయగా, మరో 600 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సీఎస్‌పురం సోలార్‌ పార్కు నుంచి ఉత్పత్తి చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్షించి పనులను వేగవంతం చేశారు.

ఈ విధంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ జీఈసీఎల్‌) ద్వారా సోలార్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 5930.88 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 1558.67 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2137 ఎకరాలు, పట్టా భూమి సుమారు 300 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే సోలార్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం పట్టా భూములను ఇచ్చిన రైతులకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.25 వేల చొప్పున లీజు కూడా చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా లీజుకు చెల్లించే మొత్తానికి రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున పెంచుతూ లీజు చెల్లిస్తారు.   

Share your comments

Subscribe Magazine